Share News

నల్లమలలో ప్లాస్టిక్‌ కనిపించకూడదు

ABN , Publish Date - Apr 05 , 2024 | 11:43 PM

నల్లమలలో ప్లాస్టిక్‌ అనేదే కనిపించకూడదని కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు ఫీల్డ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాజెక్టు టైగర్‌ బీఎన్‌ఎన్‌ మూర్తి అన్నారు.

నల్లమలలో ప్లాస్టిక్‌ కనిపించకూడదు

పీఎఫ్‌ఎఫ్‌డీ బీఎన్‌ఎన్‌ మూర్తి

రుద్రవరం, ఏప్రిల్‌ 5 : నల్లమలలో ప్లాస్టిక్‌ అనేదే కనిపించకూడదని కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు ఫీల్డ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాజెక్టు టైగర్‌ బీఎన్‌ఎన్‌ మూర్తి అన్నారు. శుక్రవారం నంద్యాల జిల్లాలోని రుద్రవరం సబ్‌ డివిజను పరిధిలో చెలిమ, రుద్రవరం రేంజ్‌లలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెలిమ రేంజ్‌లో రెండు పెద్దపులుల, రుద్రవరంలో ఒక పెద్దపులి పాదముద్రల గుర్తించామన్నారు. వన్యప్రాణుల నీటి ఆవాసాలైన బావులు, ఏర్లు, తుళ్లవాగు రిజర్వాయరు, చెరువులను పరిశీలించామని తెలిపారు. పెద్దపులులు, వన్యప్రాణులకు హానీ కలిగించే ప్లాస్టిక్‌ను నిషేధిద్దామని కోరారు. దేవాలయాల సమీపంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు పడి ఉండడాన్ని గమనించి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్‌ వ్యర్ధాలను ఇకపై కనిపించకూడదని ఆదేశించారు. కార్యక్రమంలో నంద్యాల డిప్యూటీ డైరెక్టరు వైల్డ్‌లైఫ్‌ విభాగం అధికారి అనురాగ్‌మీనా, రేంజర్లు శ్రీపతినాయుడు, ఈశ్వరయ్య, డిప్యూటీ రేంజర్లు ముర్తుజావలి, నాగేంద్రనాయక్‌, సెక్షన్‌ ఆఫీసర్లు మక్తర్‌బాషా, శ్రీనివాసులు, నాగరాజు, కిశోర్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 05 , 2024 | 11:43 PM