Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

టీడీపీ విజయాన్ని ఏ శక్తి ఆపలేదు

ABN , Publish Date - Mar 03 , 2024 | 12:29 AM

తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఏ శక్తి ఆపలేదని, మే తర్వాత టీడీపీ-జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు కానుందని పాణ్యం టీడీపీ అభ్యర్థి గౌరు చరిత అన్నారు.

టీడీపీ విజయాన్ని ఏ శక్తి ఆపలేదు
టీడీపీ మేనిఫెస్టో కరపత్రాలు అందజేస్తున్న గౌరు చరిత

పాణ్యం టీడీపీ అభ్యర్థి గౌరు చరిత

కల్లూరు, మార్చి 2: తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఏ శక్తి ఆపలేదని, మే తర్వాత టీడీపీ-జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు కానుందని పాణ్యం టీడీపీ అభ్యర్థి గౌరు చరిత అన్నారు. శనివారం 32వ వార్డు ముజ ఫర్‌నగర్‌లో ఆమె బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికీ తిరిగి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఎన్నికల మేనిఫేస్టో కరపత్రా లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా గౌరు చరిత మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్ని కుట్రలు పన్నినా టీడీపీ-జనసేన కూటమి గెలుపు తఽథ్యమన్నారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజల కోసం చంద్రబాబు ఆరు పథకా లను ప్రవేశపెట్టారన్నారు. శంఖారావం, బాబు ష్యూరిటీ కార్యక్రమాలను ప్రజ లకు వివరించాలని క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌లెవల్‌ కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో కల్లూరు అర్బన్‌ కన్వీనర్‌ పెరుగు పురుషోత్తంరెడ్డి, ప్రభాకర్‌ యాదవ్‌, బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, టీడీపీ జిల్లా కోశాధికారి పీయూ మాదన్న, కాసాని మహే్‌సగౌడ్‌, అయ్యప్పరెడ్డి, శేఖర్‌చౌదరి, పెద్దబీచుపల్లి, టైలర్‌ నాగర ాజు, ఖాజా, బందేనవాజ్‌, మాజీ కార్పొరేటర్‌ సోమన్న, కోటే్‌షగౌడ్‌, జనసేన నాయకులు సుధాకర్‌, శ్రీనివాసరెడ్డి, నగేష్‌, రాజు పాల్గొన్నారు.

వివేకా హత్య కేసులో జగన్‌ పాత్రపై విచారణ చేపట్టాలి:

వివేకా నందరెడ్డి హత్యకేసులో జగన్‌రెడ్డి పాత్రపై సీబీఐ విచారణ చేపట్టాలని పాణ్యం టీడీపీ అభ్యర్థి గౌరుచరిత శనివారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. రాజకీయ లబ్ధి కోసం జగన్‌రెడ్డి మూఠానే వైఎస్‌ వివేకాను హత మార్చిందని ఆరోపించారు. గొడ్డలి పోటుతోనే బాబాయ్‌ చనిపోయారని జగన్‌రెడ్డి కచ్చితంగా ఎలా చెప్పగలిగారన్నారు. సీబీఐ విచారణ చేయాలని సునీతమ్మ కొరితే జగన్‌ రెడ్డి ఎందుకు ఆపారని, మొదట సీబీఐ విచారణ కావాలని కోరిన జగన్‌ తర్వాత వద్దు అనడం వెనుక ఉన్న కారణాలను ప్రజలకు తెలియజెప్పాలన్నారు. తన తండ్రికి న్యాయం చేయాలని కూతురు సునీతమ్మ పోరాడుతుంటే తమ్ముడు ఆవినా్‌షను సీబీఐ అరెస్టు చేయకుండా జగన్‌ అడ్డుపడుతున్నారని అన్నారు.

Updated Date - Mar 03 , 2024 | 12:29 AM