Share News

నవరత్నాలు.. నవ మోసాలు

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:45 AM

వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవ రత్నాలు నవమోసాలు అయ్యాయని బనగానపల్లె టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్‌రెడ్డి విమర్శించారు.

నవరత్నాలు.. నవ మోసాలు

మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి

బనగానపల్లె, ఏప్రిల్‌ 24: వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవ రత్నాలు నవమోసాలు అయ్యాయని బనగానపల్లె టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్‌రెడ్డి విమర్శించారు. బనగానపల్లె పట్టణంలోని తెలుగుపేట వీధిలో బుధవారం ప్రజాగళం కార్యక్రమం నిర్వహించి ఇంటింటికీ టీడీపీ ప్రవేశపెట్ట బోయే సూపర్‌ సిక్స్‌ పథకాల గురించి వివరించారు. బీసీకి తెలుగుపేట వాసు లు, టీడీపీ, జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. బీసీ మాట్లా డుతూ ఎన్నికల ముందు సీఎం జగన్‌ నవరత్నాలు అంటూ డప్పు కొట్టి ఎన్నికల్లో గెలించి నవరత్నాలు నవమోసాలుగా మార్చారని విమర్శించారు. అమ్మవడి కింద రూ.15వేలు ఇస్తామని రూ.13వేలు ఇచ్చి మోసం చేశార న్నారు. ప్రతిపథకంలో అర్హులైన వారిని ఏదో ఒక కుంటిసాకులు, నిబంధన లతో ప్రజలను నయవంచన చేసిన సైకో సీఎం జగన్‌ అని విమర్శించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

టీడీపీలోకి చేరికలు : బనగానపల్లె నియోజకవర్గంలో వైసీపీకి బీటలు పడుతున్నాయి. అవుకు మండలం కొండమనాయినిపల్లె, జోలాపురం, బనగా నపల్లె, పెట్రికోటకు చెందిన పలు వైసీపీ కుటుంబాలవారు టీడీపీలో చేరారు. అవుకు మండలం కొండమనాయినిపల్లెకు చెందిన పలువురు వైసీపీ నాయ కులు బీసీ జనార్దన్‌రెడ్డి సమక్షంలో బుధవారం టీడీపీలో చేరారు. అలాగే హుసేనాపురానికి చెందిన జహంగీర్‌ ఆధ్వర్యంలో బనగానపల్లె పట్టణానికి చెందిన ఫజిల్‌ఆలీబేగ్‌, పెయింటర్‌ జహంగీర్‌, బబ్లు, సాగర్‌, సమద్‌, చాం ద్‌బాషా తదితర 40 కుటుంబాలు టీడీపీలో చేరాయి. వీరికి బీసీ టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే బనగానపల్లె మండలం జోలాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ నర్లమద్దిలేటిరెడ్డి కుమారుడు నర్ల మదన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో గుడిపాటి మద్దిలేటి, బాలమద్దిలేటి, నీలి మద్దిలేటి, మధుబాబు, దస్తగిరి తదితరులు టీడీపీలో చేరారు.

పెట్నికోటలో.. కొలిమిగుండ్ల మండలం పెట్నికోట గ్రామానికి చెందిన 30 కుటుంబాల వారు వైసీపీని వీడి బుధవారం టీడీపీలో చేరారు. టీడీపీ సీనియర్‌ నాయకులు ఐవీ పక్కీర్‌రెడ్డి, జంగిటి నాగిరెడ్డి ఆధ్వర్యంలో గ్రామా నికి చెందిన శివారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, నారాయణరెడ్డి, పెద్దరామిరెడ్డి, చంద్రశే ఖర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, కుమ్మెత్తరామిరెడ్డి తదితరులు టీడీపీలో చేరారు. వీరికి బీసీ జనార్దన్‌రెడ్టి టీడీపీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

Updated Date - Apr 25 , 2024 | 12:45 AM