Share News

నందికొట్కూరును పరిశుభ్రంగా ఉంచాలి: ఎమ్మెల్యే

ABN , Publish Date - Jul 01 , 2024 | 12:09 AM

నందికొట్కూరు పరిశుభ్రంగా ఉండాలంటే అందుకు కార్మికులే ప్రధాన మూలమని, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య కార్మికులకు సూచించారు.

నందికొట్కూరును పరిశుభ్రంగా ఉంచాలి: ఎమ్మెల్యే
నందికొట్కూరులో మురుగు కాలువను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే

నందికొట్కూరు, జూన్‌ 30: నందికొట్కూరు పరిశుభ్రంగా ఉండాలంటే అందుకు కార్మికులే ప్రధాన మూలమని, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య కార్మికులకు సూచించారు. ఆదివారం ఉదయం పట్టణంలోని 16వ వార్డులో పారిశుధ్య పనులను పరిశీలించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణం పరిశుభ్రంగా ఉండాలన్నా, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్న ప్రధానంగా పారిశుధ్య కార్మికులు తమ విధులను సక్రమంగా నిర్వహిస్తేనే సాధ్యమవుతుందని అన్నారు. పట్టణంలో ఎక్కడా చెత్తాచెదారం పేరుకుపోయిందన్న ఫిర్యాదులు రాకూడదన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు లింగమయ్య, బ్యాటరీ బాషా, శ్రీను, నిమ్మకాయల రాజు, మల్లికార్జున, తదితరులు పాల్గొన్నారు.

నందికొట్కూరులోని సీఎస్‌ఐ చర్చిలో నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్యను ఆ సంఘం సభ్యులు సన్మానించారు. ఆదివారం ఎమ్మెల్యే ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత గురువులు ఎమ్మెల్యేను ఆశీర్వదించారు. అనంతరం సీఎస్‌ఐ చర్చి సంఘం సభ్యులు జాన్‌, రవి తదితరులు ఎమ్మెల్యేను సన్మానించారు.

ఎమ్మెల్యేకు సన్మానం

పగిడ్యాల: ప్రాతకోట గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్న నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్యను గ్రామ టీడీపీ నాయకులు సన్మానించారు. నీటి సమస్య పరిష్కారాన్ని ఏర్పాటు చేసిన నూతన బోర్లను ఎమ్మెల్యే ఆదివారం పరిశీలించారు. గ్రామంలోని మైనార్టీ, ఎస్సీ కాలనీలో తీవ్ర నీటి సమస్య ఉండటంతో ఆ కాలనీల ప్రజలు ఎన్నికల ప్రచారంలో సమస్యను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. గ్రామంలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కారించేందుకు గాను ఆయన ఆర్‌డబ్ల్ల్యూస్‌ అధికారులతో మాట్లాడి నూతన బోర్లకు నిధులు మంజూరు చేయడంతో ఆయా కాలనీలో మూడు రోజుల క్రితం బోర్లను ఏర్పాటు చేశారు. దీంతో కాలనీ వాసులు, నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేను సన్మానించి సంతోషాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ మండల కన్వీనర్‌ పలుచాని మహేశ్వరరెడ్డి, నాగశేషులు, బాలీశ్వర్‌గౌడ్‌, వెంకటరెడ్డి, రమణ, వెంకటేశ్వర్లు, ఇస్మాయిల్‌, అశోక్‌ పాల్గొన్నారు.

నేడు పగిడ్యాలకు రాక

పగిడ్యాల: పగిడ్యాల ఎంపీడీవో కార్యాలయం వద్ద సోమవారం చేపటనున్న పింఛన్‌ పంపిణీ కార్యక్రమానికి సోమవారం ఎమ్మెల్యే జయసూర్య హాజరు కానున్నట్లు ఎంపీడీవో కవిరాజ్‌ తెలిపారు. ఉదయం 9గంటలకు కార్యలయానికి చేరుకొని లబ్ధిదారులకు పింఛన్‌ అందజేస్తారని ఆయన తెలిపారు. మండలంలో 4947 పింఛన్లు ఉన్నట్లు తెలిపారు.

Updated Date - Jul 01 , 2024 | 12:09 AM