Share News

నాగటూరు ఎత్తిపోతల పైప్‌ లీకేజీ

ABN , Publish Date - Dec 07 , 2024 | 12:02 AM

నందికొట్కూరు మండలంలోని నాగటూరు వద్ద గల ఎత్తిపోతల పథకం 2వ స్టేజీ పైపు నుండి నీరు భారీగా లీకేజీ అవుతోంది.

 నాగటూరు ఎత్తిపోతల పైప్‌ లీకేజీ
భారీగా లీకేజీ అవుతున్న నీరు

నందికొట్కూరు రూరల్‌ డిసెంబరు6 (ఆంధ్రజ్యోతి) : నందికొట్కూరు మండలంలోని నాగటూరు వద్ద గల ఎత్తిపోతల పథకం 2వ స్టేజీ పైపు నుండి నీరు భారీగా లీకేజీ అవుతోంది. ఈ నీరు తిరిగి కృష్ణా నది బ్యాక్‌ వాటర్‌లో కలుస్తోంది. దీని వల్ల రైతుల పంట పొలాలకు వెళ్ల వలసిన నీరు వృథా అవుతోం ది. కరెంట్‌ బిల్లులు, నీటి కొరతతో రైతులు ఇబ్బందిపడుతోంటే అధికారులు మాత్రం ఎత్తిపోతల నిర్వహణను గాలికి వదిలేసి చోద్యం చూస్తున్నారు. గత కొన్ని రోజులుగా నీరు లీకేజీ అవుతోందని రైతులు చెబుతున్నారు. పోటీ పడి ఎత్తిపోతలపై పెత్తనం కోసం పదవులు దక్కించుకొన్న వారు గానీ, అధికారులు గానీ ఈ సమస్యను పట్టించుకో లేదని రైతులు విమర్శిస్తున్నారు. నీటి లీకేజీని అరికట్టి ఎత్తిపోతల పథకాన్ని సరైన రీతిలో నిర్వహించాలని రైతులు కోరుతున్నారు.

నిధులు లేవు : నారాయణ రెడ్డి, ఏఈ

నీరు లీకేజీ అవుతున్న విషయం వాస్తవమే. దానిని అరికట్టేందుకు నిధులు లేవు. ఎత్తిపోతల నిర్వహణ సిబ్బందికి కనీసం వేతనాలు కూడా ఇవ్వడం లేదు. ఈ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకువెళ్తే... ఎవరం ఏమీ చేయలేమని అన్నారు. నిధులు వచ్చాక పనులు చేయిస్తాం.

Updated Date - Dec 07 , 2024 | 12:02 AM