Share News

అడిషనల్‌ ఎస్పీగా నాగరాజు

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:20 AM

కర్నూలు అడిషనల్‌ ఎస్పీ (అడ్మిన్‌)గా నాగరాజు గురు వారం జిల్లా పోలీసు కార్యా లయంలో బాధ్యతలు స్వీక రించారు.

అడిషనల్‌ ఎస్పీగా నాగరాజు

కర్నూలు, జనవరి 11: కర్నూలు అడిషనల్‌ ఎస్పీ (అడ్మిన్‌)గా నాగరాజు గురు వారం జిల్లా పోలీసు కార్యా లయంలో బాధ్యతలు స్వీక రించారు. అనంతరం ఆయన ఎస్పీ కృష్ణకాంత్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. అడి షనల్‌ ఎస్సీ నాగరాజు సొం తూరు తిరుపతి. ఈయన 1989 ఎస్సై బ్యాచ్‌కు చెందినవారు. ఎస్సైగా కడప జిల్లాలో పలు పోలీసు స్టేషన్లలో పని చేశారు. 2000లో సీఐగా పదోన్నతి పొందారు. 2011లో డీఎస్పీగా పదోన్నతి పొంది సీఐడీ, హైదారాబాదు, తాడిపత్రి, ఏసీబీ విభాగాల్లో పని చేశారు. కడప జిల్లా జమ్ములమడుగులో డీఎస్పీ పనిచేస్తూ అడిషనల్‌ ఎస్పీగా పదోన్నతి పొంది బదిలీపై కర్నూలు వచ్చారు. అడిషనల్‌ ఎస్పీని పలువురు పోలీసు అధికారులు, డీపీవో సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు.

Updated Date - Jan 12 , 2024 | 12:20 AM