Share News

‘ప్రజలకు అందుబాటులో ఉండాలి’

ABN , Publish Date - Mar 06 , 2024 | 12:06 AM

సచివాలయాల ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజలకు అందుబాటులో ఉండాలని, సమస్యలను పరిష్కరించాలని డీఎల్‌డీవో మురళీకళ్యాణి సూచించారు.

‘ప్రజలకు అందుబాటులో ఉండాలి’

గోస్పాడు, మార్చి 5: సచివాలయాల ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజలకు అందుబాటులో ఉండాలని, సమస్యలను పరిష్కరించాలని డీఎల్‌డీవో మురళీకళ్యాణి సూచించారు. మండలంలోని జూలేపల్లె, యాళ్ళూరు సచివాలయాలను మంగళవారం తనిఖీ చేశారు. సచివాలయాల్లోని రికార్డులను పరిశీలించారు. బయోమెట్రిక్‌ అటెండెన్స్‌, ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, సచివాలయాల్లో అర్జీలను పరిశీలించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలలు అందించాలన్నారు. ఆమె వెంట ఎంపీడీవో నాగఅనసూయ, తదితరులు ఉన్నారు.

Updated Date - Mar 06 , 2024 | 12:06 AM