Share News

మట్టి ఎద్దుల పండుగ

ABN , Publish Date - Jul 05 , 2024 | 11:59 PM

మట్టెద్దుల పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఇంటికి తీసుకువెళ్లి ప్రత్యేక నైవేద్యాలు పెట్టి పూజలు చేశారు.

మట్టి ఎద్దుల పండుగ

హొళగుంద/కోసిగి, జూలై 5: మట్టెద్దుల పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఇంటికి తీసుకువెళ్లి ప్రత్యేక నైవేద్యాలు పెట్టి పూజలు చేశారు. సాయంత్రం వాటికి ముస్తాబు చేసి, డప్పు వాయిద్యాల మధ్య ఊరేగింపు నిర్వహించారు. ఇలా చేస్తే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని రైతన్నల నమ్మకం. కోసిగి మండల కేంద్రంలోని 3వ వార్డులో మట్టి ఎద్దులను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. డప్పు వాయిద్యాల మద్య కలశాలతో ఆంజనేయస్వామి దేవాలయానికి ఊరేగింపుగా తీసుకెళ్లి అక్కడ పూజలు నిర్వహించారు. మట్టి ఎద్దులను పూజిస్తే పంటలు బాగా పండుతాయని, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, రైతులు ఆయురారోగ్యాలతో ఉంటారని నమ్మకం. కర్ణాటక రాష్ట్రం నుంచి ఈ పండుగ సంక్రమించినట్లు పెద్దలు చెబుతారు. మట్టి ఎద్దులను ఇళ్లకు తీసుకెళ్లి ఇళ్లలో దూలాలు, పైకప్పులపై ఏడాదంతా ఉంచుతారు. కొందరు నదుల్లో నిమజ్జనం చేస్తారు.

Updated Date - Jul 05 , 2024 | 11:59 PM