Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

20 వరకు ఎంఎస్‌ఎంఈ సర్వే: కలెక్టర్‌

ABN , Publish Date - Mar 03 , 2024 | 12:12 AM

ప్రపంచ బ్యాంక్‌ ఆర్థిక సహకారంతో కేంద్ర ప్రభుత్వం ర్యాంప్‌ స్కీమ్‌ ద్వారా రాష్ట్రంలో ఎంఎ్‌సఎంఈ ఏకీకృత పోర్టల్‌ ప్రారంభించిందని, ఈనెల 20వ తేదీ వరకు సర్వే చేపట్టాలని కలెక్టర్‌ కె.శ్రీనివాసులు అధికారులకు ఆదేశించారు.

20 వరకు ఎంఎస్‌ఎంఈ సర్వే: కలెక్టర్‌
ఎంఎస్‌ఎంఈ సర్వే పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌

నంద్యాల (నూనెపల్లె), మార్చి 2: ప్రపంచ బ్యాంక్‌ ఆర్థిక సహకారంతో కేంద్ర ప్రభుత్వం ర్యాంప్‌ స్కీమ్‌ ద్వారా రాష్ట్రంలో ఎంఎ్‌సఎంఈ ఏకీకృత పోర్టల్‌ ప్రారంభించిందని, ఈనెల 20వ తేదీ వరకు సర్వే చేపట్టాలని కలెక్టర్‌ కె.శ్రీనివాసులు అధికారులకు ఆదేశించారు. శనివారం కలెక్టర్‌ కార్యాలయంలో పరిశ్రమల జిల్లా మేనేజర్‌ శ్రీనివాస్‌ యాదవ్‌తో కలిసి పోస్టర్లను విడుదల చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ తయారీ, సేవా, వాణిజ్య రంగంలోని అన్ని ఎంఎ్‌సఎంఈలను సర్వే చేసి వాటిని డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లోకి తీసుకొని వచ్చి పోర్టల్‌కు అనుసంధానించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాలలో ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, పట్టణ ప్రాంతాలలో వార్డు అమినిటీస్‌ సెక్రెటరీలు సర్వేలు చేపట్టాలని ఆదేశించారు. పరిశ్రమల శాఖ ఎంఎ్‌సఎంఈ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న సర్వేలో డేటాను సేకరించి పోర్టల్‌ను అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. దీని ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంఎ్‌సఎంఈలకు అందించే పథకాలు, బ్యాంక్‌ రుణాలు సులభంగా పొందడం, ఆలస్యమైన చెల్లింపులను, తదితర వాటి నుంచి ప్రయోజనాలు లాభిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 03 , 2024 | 12:12 AM