ఆర్‌యూ ప్రొఫెసర్‌కు మెమో
ABN , Publish Date - Oct 20 , 2024 | 12:44 AM
రాయలసీమ యూనివర్సిటీ ప్రొఫెసర్ గత నెలలో తన పుట్టిన రోజు వేడుకలకు వసతి గృహాల్లోని విద్యార్థులను ఇంటికి పిలుచుకోవడం వివాదాస్పదమైంది.
కర్నూలు, అర్బన్, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): రాయలసీమ యూనివర్సిటీ ప్రొఫెసర్ గత నెలలో తన పుట్టిన రోజు వేడుకలకు వసతి గృహాల్లోని విద్యార్థులను ఇంటికి పిలుచుకోవడం వివాదాస్పదమైంది. ఇంజనీరింగ్ కళాశాలలోని ఈసీఈ బ్రాంచి విభాగంలో అసిస్టెంట్ ప్రొఫె సర్‌గా పని చేస్తున్న ఈయన గతంలో నగరంలోని ఓ ఇంజ నీరింగ్ కళాశాలలో విద్యార్ధినుల వ్యవహారంలో ఆరోప ణలు ఎదుర్కోవడంతో విధుల నుంచి తొలగించారు. ఆ తర్వాత వర్శిటీలో చేరినా ప్రవర్తన మార్చుకోలేదని కొందరు విద్యా ర్థులు ఆరోపిస్తున్నారు. వర్శిటీలోని రెండు వసతి గృహాల్లో వార్డెన్ల అనుమతి లేకుండా విద్యార్థులను ఇంటికి తీసుకె ళ్లడం వివాదాస్పదంగా మారింది. మహిళా వసతి గృహం నుంచి విద్యార్థినిలను పంపించకపోవడంతో వార్డెన్‌తో ఆయన వాగ్వాదానికి దిగాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులను గ్రూపులుగా ఏర్పాటు చేసి ఊటీ లాంటి విహార యాత్రకు పంపించాడనే మరో ఫిర్యాదు ఉన్నతాధి కారులకు చేరింది. వర్శిటీలో కొందరు విద్యార్థులతో ఒక గ్యాంగ్‌ను ఏర్పాటు చేశాడని, కొందరు ప్రొఫెసర్లను టార్గెట్ చేసుకుని వేధింపులకు గురిచేస్తున్నట్లు సమాచారం. స్పందించిన ఉన్నతాధికారులు ఆయనకు మెమో జారీ చేస్తూ.. ముగ్గురు ప్రొఫెసర్లతో విచారణకు కమిటీ వేశారు. కమిటీ నివేదిక ప్రకారం చర్యలు ఉంటా యని, వర్శిటీకి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. రిజి స్ర్టార్ బోయ విజయకుమార్ నాయుడు వద్ద ప్రస్తావించగా కొత్తగా వచ్చానని, తెలుసుకుని స్పందిస్తానని తెలిపారు.