Share News

రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం

ABN , Publish Date - Apr 05 , 2024 | 12:44 AM

ఎన్నికల ప్రవర్తనా నియామవళి తదితర అంశాలపై గురువారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్‌ జి.సృజన సమావేశం నిర్వ హించారు.

రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం

కర్నూలు(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 4: ఎన్నికల ప్రవర్తనా నియామవళి తదితర అంశాలపై గురువారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్‌ జి.సృజన సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఫార్మ్‌-6, 8లను ఏప్రిల్‌ 16 వరకు స్వీకరించి వాటిని ఈనెల 25వ తేదీ నాటికి విడుదల చేస్తామ న్నారు. ఎంసీసీకి సంబంధించి ఇప్పటి వరకు మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ పాటించని 32 మంది ఉద్యోగులపై చర్యలు తీసుకున్నామన్నారు. ఎగ్జిట్‌ ఓపినీ యన్‌ పోల్స్‌ నిర్వహించకూడదన్నారు. ఎపిక్‌ కార్డులకు సంబంధించి ఇప్పటి వరకు 2,65,000 ప్రింట్‌ చేశామని, ఇంకా 60 వేలు ప్రింటింగ్‌లో ఉన్నాయని అన్నారు. వీటిలో 2,40,000 పోస్టల్‌ శాఖ ద్వారా డెలివరి చేశామన్నారు. ప్రింటింగ్‌లో 60వేలు, మిగిలిన 20 వేలు ఎపిక్‌ కార్డులను కూడా త్వరితగతిన పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటా మన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌కు సంబంధించి ఎన్నికల విధులలో ఉన్న వారితోపాటు అత్యవసర సర్వీసులైన 33 శాఖలకు చెందిన వారిని పోస్టల్‌ బ్యాలెట్‌ అందజేస్తామన్నారు. ఈవీఎం గోడౌన్‌లో ఏప్రిల్‌ 12న ఈవీఎం మిషన్ల మొదటి విడత సంబంధించి ర్యాండమైజేషన్‌ చేస్తామ న్నారు. ఈ సమావేశంలో డీఆర్వో మధుసూదన్‌రావు, వైసీపీ లీగల్‌సెల్‌ జనరల్‌ సెక్రటరీ కె.పుల్లారెడ్డి, టీడీపీ ప్రతినిధి చంద్రహాస్‌, బీజేపీ ప్రతినిధి బి.కోటేశ్వర్లు, సీపీఐ ప్రతినిధి కేవీ నారాయణ, బీఎస్పీ ప్రతినిధి జి.అరుణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 05 , 2024 | 12:44 AM