Share News

భారీగా బాణసంచా సీజ్‌

ABN , Publish Date - May 25 , 2024 | 12:01 AM

నంద్యాల వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రూ.3.20లక్షల విలువచేసే బాణాసంచాను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ బీవీ చలపతి తెలిపారు.

భారీగా బాణసంచా సీజ్‌

నంద్యాల క్రైం, మే 24: నంద్యాల వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రూ.3.20లక్షల విలువచేసే బాణాసంచాను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ బీవీ చలపతి తెలిపారు. పట్టణంలోని బంగారు అంగళ్ల వీధి, కల్పన సెంటర్‌ వీధుల్లోని ఫ్యాన్సీ స్టోర్‌మాటున అక్రమంగా బాణాసంచా (క్రాకర్స్‌), టపాకాయలు తదితరాలను విక్రయిస్తుండగా శుక్రవారం సీఐ చలపతి, ఎస్సై అంకన్న, సిబ్బంది దాడులు చేశారు. 74బాక్స్‌ల్లో టపాకాయలు గుర్తించిన ట్లు సీఐ తెలిపారు. వాటి విలువ సుమారు రూ.3.20లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. టపాకాయలను స్వాధీనం చేసుకొని వాటిని విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ వివరించారు.

Updated Date - May 25 , 2024 | 12:01 AM