Share News

మార్కెట్‌ కళకళ

ABN , Publish Date - Nov 06 , 2024 | 12:09 AM

కర్నూలు మార్కెట్‌ యార్డు మంగళవారం వివిధ పంట ఉత్పత్తుల విక్రయాలతో కళకళలాడింది. పంట ఉత్పత్తులు విక్రయానికి తెచ్చిన రైతులు సంతోషం వ్యక్తం చేశారు.

 మార్కెట్‌ కళకళ
కర్నూలు యార్డులో పోటెత్తిన ఉల్లి

కర్నూలు అగ్రికల్చర్‌, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): కర్నూలు మార్కెట్‌ యార్డు మంగళవారం వివిధ పంట ఉత్పత్తుల విక్రయాలతో కళకళలాడింది. పంట ఉత్పత్తులు విక్రయానికి తెచ్చిన రైతులు సంతోషం వ్యక్తం చేశారు. సోమవారం మంత్రులు నిమ్మల రామానాయుడు, టీజీ భరత్‌ యార్డులో పర్యటించి రైతులకు మద్దతు ధర అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో వివిధ పంట ఉత్పత్తులకు మద్దతు ధర అందేలా వారు తీసుకున్న చర్యలు సత్ఫలితాలిచ్చాయి. ఉల్లిగడ్డలు 6,879 క్వింటాళ్లు విక్రయానికి రాగా గరిష్ఠ ధర రూ.4,669లు, మధ్యస్థ ధర రూ.3,898, కనిష్ట ధర రూ.644లు రైతులకు అందినట్లు సెలక్షన్‌ గ్రేడ్‌ సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు. అదేవిధంగా వాము ధర కూడా ఆశాజనకంగా ఉంది. 148 క్వింటాళ్ల వాము విక్రయానికి వచ్చింది. గరిష్ఠ ధర రూ.20,960లు, మధ్యస్థ ధర రూ.20,860, కనిష్ట ధర రూ.12,269లు దక్కింది. మొక్కజొన్నలకు క్వింటానికి గరిష్టంగా రూ.2,271, మధ్యస్థ ధర రూ.2,189, కనిష్ఠ ధర రూ.1,869 పలికింది. ఎండుమిరపకు గరిష్ఠ ధర రూ.12,345, మధ్యస్థ ధర రూ.5,711, కనిష్ఠ ధర రూ.1,039గా నిర్ణయించారు. కొర్రలకు గరిష్ట ధర రూ.3,491, మధ్యస్థ ధర రూ.2,871, కనిష్ఠ ధర రూ.589కు టెండర్‌ ఖరారైంది. మినుములకు గరిష్ఠ ధర రూ.7,739, మధ్యస్థ ధర రూ.7,396, కనిష్ట ధర రూ.1,300 రైతులకు దక్కింది. సజ్జలు గరిష్ట, మధ్యస్థ ధరలు రూ.2,191, రూ.2,159కు, కనిష్ఠ రూ.1,969 పలికింది. సోయాబీన్స్‌ గరిష్ఠ ధర రూ.4,191, మధ్యస్థ ధర రూ.4,191, కనిష్ఠ ధర రూ.4,079 రైతులకు దక్కిందని సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు.

Updated Date - Nov 06 , 2024 | 12:09 AM