మల్లారెడ్డికుంట గండికి మరమ్మతులు
ABN , Publish Date - Sep 10 , 2024 | 01:07 AM
మండలంలోని చిన్నవంగలి గ్రామ సమీపంలోగల మల్లారెడ్డి కుంట గండికి మరమ్మతులు చేపడతామని ఆళ్లగడ్డ మైనర్ ఇరిగేషన డీఈ గురుమూర్తి, ఏఈ మునాఫ్ తెలిపారు.
చాగలమర్రి, సెప్టెంబరు 9: మండలంలోని చిన్నవంగలి గ్రామ సమీపంలోగల మల్లారెడ్డి కుంట గండికి మరమ్మతులు చేపడతామని ఆళ్లగడ్డ మైనర్ ఇరిగేషన డీఈ గురుమూర్తి, ఏఈ మునాఫ్ తెలిపారు. సోమవారం మల్లారెడ్డి కుంట కట్ట గండిని పరిశీలించారు. వారు మాట్లాడుతూ రూ.5 లక్షలతో తాత్కళిక మరమ్మతు పనులు చేపడతామని అన్నారు. నీరు వృథా పోకుండా పనులు వేగవంతం చేసి కట్ట పటిష్టం చేస్తామని అన్నారు. శాశ్విత మరమ్మతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని అ న్నారు. వ్యవసాయశాఖ వారు దెబ్బతిన్న పంటలను పరిశీలించి నష్టం అం చనా వేస్తారని అన్నారు. వారి వెంట టీడీపీ నాయకులు నరేంద్రారెడ్డి, నర్సిరెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి, సంజీవరెడ్డి, రైతులు ఉన్నారు.