Share News

మలేరియా కేసులు తగ్గాయి

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:18 AM

జిల్లాలో మలేరియా కేసులు బాగా తగ్గాయని డీఎంహెచ్‌వో వై.ప్రవీణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం పురస్కరించుకుని బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం డీఎంహెచ్‌వో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.

మలేరియా కేసులు తగ్గాయి

కర్నూలు(హాస్పిటల్‌), ఏప్రిల్‌ 24: జిల్లాలో మలేరియా కేసులు బాగా తగ్గాయని డీఎంహెచ్‌వో వై.ప్రవీణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం పురస్కరించుకుని బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం డీఎంహెచ్‌వో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. 2024లో 1,32,943 మం దికి శ్యాంపిల్స్‌ను సేకరించగా అందులో దేవనకొండ మండలం కోటకొండలో ఓ వ్యక్తికి మలేరియా సోకిందని ఈ కేసు మినహా జిల్లాలో ఎక్కడా కేసులు వెలుగు చూడలేదన్నారు. జిల్లా మలే రియా అధికారి నూకరాజు మాట్లాడుతూ జిల్లాలో ప్రతి శుక్రవారం ఫ్రైడే-ఢ్రైడేను నిర్వహిస్తున్నామన్నారు. సమావేశంలో అడిషినల్‌ డీఎంహెచ్‌వో భాస్కర్‌, అసిస్టెంట్‌ మలేరియా అధికారి చంద్రశేఖర్‌రావు, ఆర్‌బీఎస్‌కే జిల్లా కోఆర్డినేటర్‌ హేమ లత, డీబీసీఎస్‌ డాక్టర్‌ సంద్య, డెమో ప్రమీలాదేవి, ఎస్‌వో హేమసుందరం, డిప్యూటీ డెమో చంద్రశేఖర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 12:18 AM