Share News

ఓట్ల లెక్కింపును విజయవంతం చేయండి

ABN , Publish Date - May 27 , 2024 | 11:36 PM

జూన్‌ 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు పటిష్టంగా చేసుకోవాలని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ మీనా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

ఓట్ల లెక్కింపును విజయవంతం చేయండి

త్వరితగతిన ఫలితాలు ప్రకటించాలి

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ మీనా

కర్నూలు(కలెక్టరేట్‌), మే 27: జూన్‌ 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు పటిష్టంగా చేసుకోవాలని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ మీనా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఎన్నికల పలితాల ప్రకటన విషయంలో ఏ మాత్రం జాప్యం చేయకుండా భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ త్వరితగతిన ఖచ్చితమైన ఫలితా లను ప్రకటించాలన్నారు. ఐదు దశల్లో ఎన్నికలు జరిఇన రాష్ట్రాల సీఈవోలు, ఆయా నియోజకవర్గాల ఆర్వోలు, జిల్లాల ఎన్నికల అధి కారులతో ఎలక్షన్‌ కమిషనర్లు జ్ఞానేష్‌ కుమార్‌, డా. సుఖ్బీర్‌ సింగ్‌ సందుతో కలిసి సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశల వారీగా దేశవ్యాప్తంగా జరుగుచున్న సార్వత్రిక ఎన్నికలను అందరి సమష్ఠి కృషితో ఎంతో విజయవంతంగా జరుగుచున్నదని అభినందించారు. ఓట్లలెక్కింపు రోజు ఈవీఎంలను భద్రపరిచిన స్ర్టాంగ్‌ రూమ్‌ల వద్ద క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిర్ణీత పాస్‌ లేకుండా ఎవరినీ అనుమతించవద్దన్నారు. నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా ఉండేలా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పవర్‌ బ్యాక్‌ ఆఫ్‌, ఫైర్‌ సేఫ్టీ పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలని, అత్యవసర ఆరోగ్య సేవలు అందజేసేందుకు అంబులెన్సులను కూడా సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు సీఈవోలు, పి. కోటేశ్వరరావు, ఎంఎస్‌ హరేందిర ప్రసాద్‌, జిల్లా కలెక్టర్‌ డా.జి. సృజన తదితరులు పాల్గొన్నారు.

టోకన్‌ సిస్టమ్‌ ఉండాలి

మొబైల్‌ డిపాజిట్‌ సెంటర్లలో టోకన్‌ సిస్టం ఉండేలా చర్యలు తీసుకోవాలని, దీనితోపాటు క్యాంపస్‌లో, కౌంటింగ్‌ హాలులో అదనపు లైటింగ్‌ ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డా.జి. సృజన సంబంధిత అధికారులను ఆదేశిం చారు. సోమవారం రాయలసీమ యూనివర్సిటీలోని కంట్రోల్‌ రూమ్‌లో స్ర్టాంగ్‌ రూమ్‌ లైవ్‌ఫీడ్‌ ఈవీఎం యంత్రా లను భద్రపరిచిన ఇంజనీరింగ్‌ బ్లాక్‌ను, కౌంటిం గ్‌ హాల్‌ను జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్‌తో కలిసి కలెక్టర్‌ డా.జి. సృజన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాయలసీమ యూనివర్సిటీలోని పార్కింగ్‌ ప్రదేశంలో, యూనివర్సిటీ మొత్తం అదనపు లైటింగ్‌ ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈని ఆదేశించారు. మొబైల్‌ డిపాజిట్‌ సెంటర్లలో మొబైల్‌ డిపాజిట్‌ చేయించుకున్న అనంతరం సంబంధిత వారికి టోకెన్‌ ఇచ్చేలా టోకన్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేసుకోవాలని డ్వామా పీడీని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగబాబు, డీఆర్వో మధుసూదన్‌రావు, ఇరిగేషన్‌ ఎస్‌ఈ రెడ్డి శేఖర్‌ రెడ్డి, డ్వామా పీడీ అమర్నాథ్‌ రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ నాగరాజు తదితరులు ఉన్నారు.

Updated Date - May 27 , 2024 | 11:36 PM