Share News

పోలింగ్‌ సామగ్రి పంపిణీకి ప్రణాళికలు రూపొందించుకోండి: కలెక్టర్‌

ABN , Publish Date - Mar 06 , 2024 | 12:27 AM

పోలింగ్‌ సామగ్రి త్వరితగతిన పంపిణీ చేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని కలెక్టర్‌ జి.సృజన రిటర్నింగ్‌ అధికారులను సూచించారు.

పోలింగ్‌ సామగ్రి పంపిణీకి ప్రణాళికలు రూపొందించుకోండి: కలెక్టర్‌

కర్నూలు(కలెక్టరేట్‌), మార్చి 5: పోలింగ్‌ సామగ్రి త్వరితగతిన పంపిణీ చేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని కలెక్టర్‌ జి.సృజన రిటర్నింగ్‌ అధికారులను సూచించారు. మంగళవారం పాణ్యం, కోడుమూరు, కర్నూలు నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్‌ సా మగ్రి పంపిణీ కేంద్రాలను కలెక్టర్‌తోపాటు ఎస్పీ జి.కృష్ణకాంత్‌ పరిశీ లిం చారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పోలింగ్‌ సిబ్బందిని పోలిం గ్‌ కేంద్రాలకు తరలించేందుకు వచ్చే బస్సులను, సెక్యూరిటీ వాహనాలను, పార్కింగ్‌ చేయడానికి కావాల్సిన స్థలం ఉందా.. లేదా అని పరిశీలించాల న్నారు. పోలింగ్‌ సిబ్బంది అందరూ ముందు రోజు మధ్యాహ్నం 2 గంట ల్లోపు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకునేటట్లుగా చర్యలు తీసుకోవాలన్నారు. వీరివెంట జాయింట్‌ కలెక్టర్‌, పాణ్యం రిటర్నింగ్‌ అధికారి నారపురెడ్డి మౌ ర్య, మున్సిపల్‌ కమిషనర్‌ భార్గవ్‌తేజ, కర్నూలు ఆర్డీవో శేషిరెడ్డి ఉన్నారు.

Updated Date - Mar 06 , 2024 | 07:30 AM