చంద్రబాబు పర్యటనను జయప్రదం చేయండి
ABN , Publish Date - Mar 03 , 2024 | 12:13 AM
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నంద్యాల పర్యటనను విజయవంతం చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ గౌడ్, పొలిట్ బ్యూరో సభ్యుడు, నంద్యాల ఇన్‌చార్జి ఎన్‌ఎండీ ఫరూక్ పిలుపునిచ్చారు.
నంద్యాల (నూనెపల్లె), మార్చి 2: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నంద్యాల పర్యటనను విజయవంతం చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ గౌడ్, పొలిట్ బ్యూరో సభ్యుడు, నంద్యాల ఇన్‌చార్జి ఎన్‌ఎండీ ఫరూక్ పిలుపునిచ్చారు. ఈనెల 6వ తేదీ చంద్రబాబు నాయుడు నంద్యాలకు రానున్న నేపథ్యంలో నంద్యాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో హెలిప్యాడ్ స్థలాన్ని టీడీపీ నాయకులు పరిశీలించారు. హెలిప్యాడ్‌కు సంబంధించిన పనులను త్వరగా పూర్తి చేయాలని మల్లెల రాజశేఖర్, ఫరూక్ సూచించారు. వారి వెంట టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఏవీఆర్ ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షుడు వాకా శివశంకర్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు మిద్దె హుసేన్‌రెడ్డి, కృపాకర్, తదితరులు ఉన్నారు.