మన మార్కెట్లో మహారాష్ట్ర ఉల్లి
ABN , Publish Date - Dec 15 , 2024 | 11:56 PM
కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులను నిషేధించడంతో దేశంలోనే ఉల్లి ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న మహారాష్ట్ర రైతులు దేశంలోనే వివిధ రాష్ట్రాల్లో ఉల్లిని ఎగుమతులు చేసేందుకు సిద్ధమయ్యారు.
కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులను నిషేధించడంతో దేశంలోనే ఉల్లి ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న మహారాష్ట్ర రైతులు దేశంలోనే వివిధ రాష్ట్రాల్లో ఉల్లిని ఎగుమతులు చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఉమ్మడి జిల్లాలో ఉల్లిని సాగు చేస్తున్న రైతుల పరిస్థితి దారుణంగా మారింది. గత వారం కర్నూలు మార్కెట్ యార్డులో రూ.4,500 దాకా క్వింటం ఉల్లి ధర అందుకున్న రైతులు తాజాగా గరిష్ఠంగా రూ.3,500 అందుకున్నారు. ఓ వైపు తెగుళ్లు, ఇంకో వైపు ధర పతనంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. గత వారం రోజుల నుంచి మహారాష్ట్ర నుంచి కర్నూలు మార్కెట్ యార్డుకు ఉల్లి దిగుమతి మొదలైంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉల్లి సరఫరా కూడా తక్కువైంది. అయినా గిట్టుబాటు ధర లభించక ఉల్లి రైతులు ఆందోళన చెందుతున్నారు.
-కర్నూలు అగ్రికల్చర్ (ఆంధ్రజ్యోతి)