Share News

గళమెత్తిన కలం

ABN , Publish Date - Feb 20 , 2024 | 01:25 AM

జర్నలిస్టుల ఆందోళనలు హోరెత్తాయి.

గళమెత్తిన కలం

ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌పై దాడి దుర్మార్గం

నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి

జర్నలిస్టు యూనియన్ల ఆధ్వర్యంలో రాస్తారోకోలు, ధర్నాలు

జర్నలిస్టుల ఆందోళనలు హోరెత్తాయి. వైసీపీ రౌడీ మూకల దాడిని జర్నలిస్టులు ముక్త కంఠంతో ఖండించారు. అనంతపురం జిల్లా రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌ శ్రీకృష్ణపై జరిగిన దాడిని నిరసిస్తూ సోమవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. కర్నూలు సహా ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, మంత్రాలయం, ఆలూరు, కోడుమూరు నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించారు. జర్నలిస్టులకు నిరసనలకు పలు పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ శ్రీకృష్ణపై దాడికి పాల్పడ్డ రౌడీ మూకలపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని అన్నారు. సీఎం జగన్‌ బేషరతుగా జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. పాత్రికేయులు తల్చుకుంటే ప్రభుత్వాలనే మార్చేయగలరని హెచ్చరించారు. అనంతరం అధికారులకు వినతి పత్రాలు అందజేశారు.

కర్నూలు (కల్చరల్‌), ఫిబ్రవరి 19: ఆంధ్రజ్యోతి అనంతపురం స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌ శ్రీకృష్ణపై వైసీపీ రౌడీల దాడిని నిరసిస్తూ జర్నలిస్టులు రోడ్డెక్కారు. జర్నలిస్టుల సంఘాల ఆధ్వర్యంలో సోమవారం జిల్లా వ్యాప్తంగా వివిధ రూపాల్లో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. కర్నూలు నగరంలో గాంధీ విగ్రహం వద్ద ధర్నా అనంతరం ఎన్టీఆర్‌ విగ్రహం సర్కిల్‌లో రాస్తారోకో నిర్వహించారు. టీడీపీ, సీపీఐ, సీపీఎం, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఏఐఎస్‌ఎఫ్‌, రాయలసీమ విద్యార్థి సంఘం, ట్రైబల్‌ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ సహా ప్రజాసంఘాలు, జర్నలిస్టు సంఘాల నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా టీడీపీ కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షుడు ఎమ్మెల్సీ బీటీ నాయుడు, మల్లెల రాజశేఖర్‌, పాణ్యం టీడీపీ ఇన్‌చార్జి గౌరు చరిత, సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి గౌస్‌ దేశాయ్‌, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు జగన్నాథం, ఐజేయూ జాతీయ సమితి సభ్యులు కే నాగరాజు, గోరంట్ల కొండప్ప, ఆంధ్రప్రదేశ్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్టు (ఏపీయూడబ్ల్యూజే) జిల్లా గౌరవాధ్యక్షుడు ఎన్‌వీ సుబ్బయ్య, జిల్లా అధ్యక్షుడు ఈఎన్‌ రాజు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్‌, ఆంధ్రజ్యోతి ఎడిషన్‌ ఇన్‌చార్జి చల్లా నవీన్‌కుమార్‌ నాయుడు, విరసం నాయకుడు పాణి మాట్లాడారు. జగన్‌ ప్రభుత్వం వచ్చాక జర్నలిస్టులపై దాడులు పెరిగాయని అన్నారు. జర్నలిస్టులపై దాడుల సంస్కృతి మంచిది కాదని, ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని హెచ్చరించారు. శ్రీకృష్ణపై దాడికి పాల్పడిన వైసీపీ రౌడీ మూకలపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కలెక్టర్‌ డాక్టర్‌ జి. సృజనకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్‌ సెక్రటరీ పి.సుంకన్న, ఏపీయూడబ్ల్యూజేఎఫ్‌ జిల్లా కన్వీనర్‌ నాగేంద్ర, ఏపీ ఎలకా్ట్రనిక్‌ మీడియా అసోసియేషన్‌ రాష్ట్ర కమిటీ సభ్యుడు అంజి, కోడుమూరు టీడీపీ యువ నాయకుడు బొగ్గుల దస్తగిరి, సీపీఐ నగర అధ్యక్షుడు రామకృష్ణ, ఏఐటీయూసీ నగర కార్యదర్శి చంద్రశేఖర్‌, టీడీపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు పి.హనుమంతరావు చౌదరి, సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆకెపోగు జయన్న, టీడీపీ నాయకులు బుర్రా వెంకటేశ్‌ నాయుడు, రామాంజినేయులు, ఏబీఎన్‌ స్టాఫర్‌ సుంకన్న, 99 టీవీ మస్తాన్‌, నాగేంద్ర ప్రసాద్‌, మల్లికార్జున, సబ్‌ ఎడిటర్లు మనోహర్‌, తుమ్మల్‌ సాహెబ్‌, ఆది నారాయణ, రఘు, రామయ్య, కెమెరా మ్యాన్‌లు శేషఫణి, వీరేష్‌, మోహన్‌, శేఖర్‌, రామ్మోహన్‌, నాగేశ్‌, ఫొటో జర్నలిస్టుల అసోసియేషన్‌ నాయకులు సుబ్రహ్మణ్యం, అంజి, రఫీ, సురేష్‌, హుస్సేన్‌, దస్తగిరి, శివకుమార్‌, అవినాష్‌, వెంకటేశ్‌, చిరంజీవి, మధు, తదితరులు పాల్గొన్నారు.

దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి

కర్నూలు(కలెక్టరేట్‌), ఫిబ్రవరి 19: అనంతపురం జిల్లా రాప్తాడులో వైసీపీ బహిరంగ సభలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌ శ్రీకృష్ణపై దాడి చేయడాన్ని నిరసిస్తూ జర్నలిస్టు జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట పాత్రికేయులు ధర్నా నిర్వహించారు. విధి నిర్వహణలో భాగంగా సీఎం జగన్‌ సభకు వెళ్లి ఫొటోలు తీస్తున్న శ్రీకృష్ణపై కొందరు వైసీపీ అల్లరి మూకలు దాడి చేయడాన్ని జేఏసీ నాయకులు ఖండించారు. దాడికి పాల్పడిన వైసీపీ మూకలను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్ర మంలో ఉమ్మడి జిల్లా జర్నలిస్టు జేఏసీ కన్వీనర్‌ టీజీ ప్రసాద్‌, ఏపీ జర్నలిస్టు ఫోరం అధ్యక్ష, కార్యదర్శులు రామకృష్ణ, సాయికుమార్‌ నాయు డు, రాష్ట్ర నాయకులు, సీనియర్‌ జర్నలిస్టులు యనమల మద్దిలేటి, చంద్రయ్య, వరప్రసాద్‌, మంజునాథ్‌ యాదవ్‌, విజయ్‌, ఇస్మాయిల్‌, మధు, రాజు, రవికుమార్‌, ఆసిఫ్‌, వలి, రాఘవేంద్ర, రామకృష్ణ, హుశేన్‌, సురేష్‌, చెన్నయ్య, ఖలీల్‌, శ్రీనివాసులు, పరమేష్‌, సలాంబాషా పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2024 | 01:25 AM