సత్వర న్యాయం అందించిన లోక్ అదాలత్
ABN , Publish Date - Jun 12 , 2024 | 11:55 PM
ఫైనాన్స్ కంపెనీ కేసులో నష్టపోయిన బాధితుడికి మంగళవారం సత్వర న్యాయ సహాయాన్ని అందించినట్లు శాశ్వత లోక్ అదాలత్ అధ్యక్షుడు ఎం.వెంకట హరినాథ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

కర్నూలు(లీగల్), జూన్ 12: ఫైనాన్స్ కంపెనీ కేసులో నష్టపోయిన బాధితుడికి మంగళవారం సత్వర న్యాయ సహాయాన్ని అందించినట్లు శాశ్వత లోక్ అదాలత్ అధ్యక్షుడు ఎం.వెంకట హరినాథ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు జిల్లాకు చెందిన ఫిర్యాది షేక్ షకీర్ తన లారీని మహావీర్ ఫైనాన్స్ అనే మరో కంపెనీకి హామీగా పెట్టి రూ.4 లక్షల రుణం తీసుకున్నాడు. అయితే.. ఆ రూ.4 లక్షల మొత్తాన్ని మహావీర్ ఫైనాన్స్ కంపెనీ నేరుగా శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీకి బదిలీ చేసింది. దీంతో తనకు రావాల్సిన బ్యాలెన్స్ మొత్తం రూ.1,88,975 వాపసు చేయాలని బాధితుడు శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీకి కోరారు. అయితే ఆ కంపెనీ స్పందించకపోవడంతో బాధితుడు శాశ్వత లోక్ అదాలత్‌ను ఆశ్రయించాడు. దీంతో శాశ్వత లోక్ అదాలత్ ఇరు పార్టీలతో చర్చించి ఇద్దరికీ ఆమోద యోగ్యంగా కేసును పరిష్కరించింది.