కలెక్టరేట్‌లో ప్రత్యక్షప్రసారం
ABN , Publish Date - Jun 12 , 2024 | 11:56 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార వేడుకలను నంద్యాల మున్సిపల్ టౌన్ హాలులో లైవ్ ప్రోగ్రాంలో కలెక్టర్ డా.కె. శ్రీనివాసులు, జేసీ, డీఆర్వో అధికారులు, ప్రజలు వీక్షించారు.

నంద్యాల కల్చరల్, జూన్ 12 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార వేడుకలను నంద్యాల మున్సిపల్ టౌన్ హాలులో లైవ్ ప్రోగ్రాంలో కలెక్టర్ డా.కె. శ్రీనివాసులు, జేసీ, డీఆర్వో అధికారులు, ప్రజలు వీక్షించారు. బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, ఇతర మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం గన్నవరం వద్ద కేసరపల్లి ఐటి పార్క్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు, మంత్రులుగా నంద్యాల ఎమ్మెల్యే ఎన్‌ఎండీ ఫరూక్, బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఇందులో జాయింట్ కలెక్టర్ రాహుల్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో పద్మజ, మున్సిపల్ కమిషనర్ నిరంజన్‌రెడ్డి, నంద్యాల ఆర్డీఓ మల్లికార్జున్ రెడ్డి, కలెక్టరేట్‌లోని వివిధ కార్యాలయాల సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.