Share News

భూస్వాములకు సింహస్వప్నం.. ఎర్రజెండా

ABN , Publish Date - Dec 27 , 2024 | 12:16 AM

భూస్వామ్య, పెత్తందారులకు ఎర్రజెండా సింహస్వప్నమని సీపీఐ రాష్ట్ర కార్య దర్శి వర్గ సభ్యుడు పి.రామచంద్రయ్య అన్నారు. పార్టీ వందేళ్ల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పట్టణంలో గురువారం నిర్వహించారు.

భూస్వాములకు సింహస్వప్నం.. ఎర్రజెండా
పత్తికొండ పట్టణంలో సీపీఐ నాయకుల బైక్‌ ర్యాలీ

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రామచంద్రయ్య

పత్తికొండలో బైక్‌ ర్యాలీ

పత్తికొండ టౌన్‌, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): భూస్వామ్య, పెత్తందారులకు ఎర్రజెండా సింహస్వప్నమని సీపీఐ రాష్ట్ర కార్య దర్శి వర్గ సభ్యుడు పి.రామచంద్రయ్య అన్నారు. పార్టీ వందేళ్ల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పట్టణంలో గురువారం నిర్వహించారు. ముం దుగా ఆర్‌అండ్‌బీ గెస్టు హౌస్‌ నుంచి బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సభలో మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన చరిత్ర సీపీఐది అన్నారు. పేదలకు లక్షలాది ఎకరాల భూ పంపిణీ చేసిందన్నారు. పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి, లౌకిక వాదన పరీరక్షణకు పోరాటాల చేద్దామని పిలుపునిచ్చారు. మాజీ జిల్లా కార్యదర్శి భీమలింగప్ప, మండల కార్యదర్శి రాజాసాహేబ్‌, పట్టణ కార్యదర్శి రామాంజనేయులు, ప్రజా సంఘాల నాయకులు సురేంద్రకుమార్‌, కృష్ణయ్య, నాగరాజు, కారన్న, వెంకట్రామిరెడ్డి, సిద్దు, వీరేష్‌, నెట్టికంటయ్య, తిమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2024 | 12:16 AM