ఇద్దరు అంధులకు వెలుగు
ABN , Publish Date - Dec 22 , 2024 | 11:28 PM
ఆయుష్ యోగా సేవా సమితి నిత్యసాధకులు శేగు రామసుబ్బయ్య తల్లి శేగు అనసూయమ్మ ఆదివారం ఉదయం స్వర్గస్తులయ్యారు.

నంద్యాల కల్చరల్, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఆయుష్ యోగా సేవా సమితి నిత్యసాధకులు శేగు రామసుబ్బయ్య తల్లి శేగు అనసూయమ్మ ఆదివారం ఉదయం స్వర్గస్తులయ్యారు. రామసుబ్బయ్య వెంటనే స్పందించి ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆర్గాన్ డొనేషన్ మోటివేషన్ కోఆర్డినేటర్ ఆనంద్‌గురూజీకి ఫోన్ చేసి తన తల్లి శేగు అనసూయమ్మ నేత్రాలను దానం చేశారు. ఈ విషయం వెంటనే రెడ్‌క్రా్‌స చైర్మన్ దస్తగిరికి తెలుపగా కర్నూలు నుంచి టెక్నీషియన్లు వచ్చి రెండు నేత్రాలను తీసుకొని హైదరాబాదు ఎల్వీప్రసాద్ ఐ హాస్పటల్‌కు పంపారు. ఈ సందర్భంగా ఆనంద్‌గురూజీ మాట్లాడుతూ యోగా సభ్యులు గత 20 సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ఇప్పుడు ఆర్గాన్ డొనేషన్‌పై దృష్టి పెట్టి ఇప్పటికి 14 మంది చేత నేత్రదానం చేపించి 28 మందికి అంధులకు వెలుగును ప్రసాదించే దిశగా పయనిస్తున్నందుకు గర్వకారణంగా ఉందన్నారు. ఆనంద్‌గురూజీ ప్రతి ఒక్కరూ కూడ శేగు అనసూయమ్మను వారి కుటుంబ సభ్యులను ఆదర్శంగా తీసుకొని అంధులకు చూపును ప్రసాదించేందుకు తమ వంతుగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ దస్తగిరి, తిరుమల రెసిడెన్నీ కాలనీ వాసులు, సుబ్బయ్య, రెడ్‌క్రాస్ ఐ టెక్నిషియన్ ప్రదీప్, సిబ్బంది వరుణ్, శివ తదితరులు పాల్గొన్నారు.