Share News

అభివృద్ధిలో ముందడుగు వేద్దాం

ABN , Publish Date - Jun 27 , 2024 | 12:07 AM

ప్రజల ఆకాంక్షలు ప్రతిభింబించేలా అభివృద్ధిలో ముందడుగు వేద్దామని డోన్‌ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి అన్నారు.

అభివృద్ధిలో ముందడుగు వేద్దాం

పారిశుధ్యం మెరుగునకు చర్యలు తీసుకోవాలి

మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఎమ్మెల్యే కోట్ల

డోన్‌, జూన్‌ 26: ప్రజల ఆకాంక్షలు ప్రతిభింబించేలా అభివృద్ధిలో ముందడుగు వేద్దామని డోన్‌ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలోని కౌన్సిల్‌ సమావేశ భవనంలో జరిగిన కౌన్సిల్‌ సమావేశానికి ఎమ్మెల్యే కోట్ల ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మొదటిసారి సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే కోట్లను మున్సిపల్‌ చైర్మన్‌ సప్తశైల రాజేష్‌, వైస్‌ చైర్మన్‌ కోట్రికే హరికిషణ్‌, కమిషనర్‌ డా.జయరాములు కలిసి పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. అనంతరం చైర్మన్‌ రాజేష్‌ అధ్యక్షతన జరిగిన సమావేశం లో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి మాట్లాడుతూ కొత్త ప్రణాళికలతో డోన్‌ను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నానన్నారు. పట్టణంలో ఇటీవల వార్డుల్లో పర్యటించానని, పారిశుధ్యం, డ్రైనేజీ, తాగునీటి సమస్య, రహదారులు, విద్యుత్‌ వంటి సమస్యలను ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. తాగునీటి సమస్య తలెత్తకుండా చూద్దామన్నారు. పట్టణంలో పారిశుధ్య మెరుగునకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ అధికారులు, కౌన్సిలర్లు సహ కారాలు అందించాలన్నారు. పట్టణంలో ప్రజ లకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం నుంచి అవస రమైన నిధులు మంజూరు చేయిం చేందుకు కృషి చేస్తానన్నారు.

ట్రాఫిక్‌ సమస్య నియంత్రించాలి: పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని ఆర్‌అండ్‌బీ ఈఈ శ్రీధర్‌ రెడ్డిని డోన్‌ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి ఆదేశించారు. బుధవారం పట్టణం లోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో రైల్వే, ఆర్‌అండ్‌బీ అధికారలుతో ఎమ్మె ల్యే కోట్ల సమీక్ష నిర్వహించారు. పట్టణంలోని పాతపేటలోకి భారీ వాహ నాలు వచ్చేలా రైల్వే అండర్‌ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. పాతపేట శ్రీరాములయం సమీపంలోని రైల్వే గేట్ల వద్ద బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు తయారు చేయాల న్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ కేశవయ్యగౌడు, డీసీ ఎంఎస్‌ మాజీ చైర్మన్‌ లక్ష్మీరెడ్డి, మర్రి రమణ, కమలాపురం సర్పంచ్‌ రేగటి అర్జున్‌ రెడ్డి, బేతంచెర్ల మండల పార్టీ అధ్యక్షుడు ఎల్లనాగయ్య, చిట్యాల మద్దయ్యగౌడు, అన్వర్‌బాషా, సీనియర్‌ న్యాయవాదులు శ్రీనివాసభట్టు, ఎస్‌టీ హరున్‌, హనుమంతరెడ్డి, ఓంప్రకాష్‌, జనసేన నాయకుడు ఆలా మోహన్‌ రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jun 27 , 2024 | 12:07 AM