నీటి ముంపునకు గురైన లక్ష్మీనగర్
ABN , Publish Date - Jun 07 , 2024 | 01:13 AM
కర్నూలు రూరల్ మండలం భూపాల్‌నగర్ పరిధిలో ఉన్న లక్ష్మీనగర్ నీటి ముంపునకు గురైంది.

బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే దస్తగిరి
కర్నూలు(రూరల్), జూన్ 6: కర్నూలు రూరల్ మండలం భూపాల్‌నగర్ పరిధిలో ఉన్న లక్ష్మీనగర్ నీటి ముంపునకు గురైంది. బుధవారం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురవడంతో గార్గేయపురం చెరువు నిండిపోయి దిగువ ఉన్న లక్ష్మీనగర్ కాలనీలోకి నీరు చేరుకున్నాయి. తద్వారా ఇళ్లల్లోకి నీరు రావ డంతో స్ధానికులకు రాత్రంతా కంటిపై కునుకు లేకుండా పోయింది. ఓవైపు విద్యుత్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న కోడు మూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, తహసీల్దార్ రామాంజులనాయక్, ఎంపీ డీవో నరసింహనాయుడుతో కలిసి గురువారం ఉదయం నీటిముంపునకు గురైన కాలనీలో పర్యటించారు. వర్షపు నీళ్లు దిగువ ప్రాంతం వైపు వచ్చిన కారణాలను బాధితులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఇళ్లలోకి నీళ్లు చేరడంతో ధాన్యపు గింజలు తడిసిముద్దయ్యాయని కాలనీ వాసులు వారికి వివరించారు. ఎవరు కూడా అధైౖర్య పడవద్దని అండగా ఉంటానని కోడు మూరు ఎమ్మెల్యే నీటి ముంపు బాధితులకు భరోసా నిచ్చారు. జరిగిన నష్ట్రాన్ని త్వరలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అన్ని విధాలుగా ఆదుకుంటామని దస్త గిరి కాలనీ వాసులకు హామీనిచ్చారు. వీరివెంట వీఆర్వో మద్దిలేటి, ఈవోఆర్డీ రామచంద్రారెడ్డి, స్థానిక టీడీపీ నాయకులు ఉన్నారు.
ఓర్వకల్లులో భారీ వర్షం
ఓర్వకల్లు: మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఓర్వకల్లులో తుంగభద్ర వాగు పొంగి పొర్లుతుంది. గత ఆరేళ్లుగా కాల్వబుగ్గలో చుక్క నీరు లేక ఎండిపోయిన కోనేర్లు వర్షం రాకతో నీటితో కళకళలాడుతున్నాయి. మండలంలోని ప్రతి గ్రామంలో చెరువలు, కుం టలు, బావులు, వాగులు నీటితో పొంగిపొర్లుతున్నాయి. దీంతో రైతులు సం తోషం వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో విత్తనాలు విత్తేందుకు సిద్ధమయ్యారు.
భారీ వర్షానికి కోట్టుకుపోయిన కల్వర్టు
గూడూరు: మండలంలోని ఆర్ ఖానాపురం గ్రామంలో గురువారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి కల్వర్టు కోట్టుకుపో యింది. ఈవిషయం తెలుసుకున్న ఆర్ ఖానాపురం సర్పంచ్ మునిస్వామి, మండల తెలుగు యువత అధ్యక్షుడు సుమన్ బాబు, టీడీపీ నాయకులు మన్యంకొండ, కృష్ణ అక్కడికి వెళ్లి పరిశీలించారు. ఈ విషయాన్ని జిల్లా టీడీపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి దృష్టికి తీసుకెళ్ళనున్నట్లు వారు తెలిపారు.