కర్నూలు-బళ్లారి హైవే ఏర్పాటు చేయాలి
ABN , Publish Date - Aug 08 , 2024 | 11:21 PM
కర్నూలు నుంచి బళ్లారికి హైవే ఏర్పాటు చేయడంతో పాటు జిల్లాలోని 167వ జాతీయ రహదారి పనులను త్వరగా పూర్తి చేయాలని ఎంపీ బస్తిపాటి నాగరాజు కేంద్రమంత్రి నితిన్ గడ్కరిని కోరారు.
కేంద్ర మంత్రికి ఎంపీ బస్తిపాటి వినతి
కర్నూలు(అర్బన్), ఆగస్టు 8: కర్నూలు నుంచి బళ్లారికి హైవే ఏర్పాటు చేయడంతో పాటు జిల్లాలోని 167వ జాతీయ రహదారి పనులను త్వరగా పూర్తి చేయాలని ఎంపీ బస్తిపాటి నాగరాజు కేంద్రమంత్రి నితిన్ గడ్కరిని కోరారు. గురువారం సాయంత్రం ఢిల్లీలో కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరిని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ మంత్రాలయం నుంచి బళ్లారికి వెళ్లే 167వ జాతీయ రహదారి పనుల్లో జాప్యం జరుగుతోందన్నారు. ఆదోని- ఆలూరు రోడ్డు అధ్వానంగా ఉందన్నారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే కర్ణాటక-ఆంధ్ర ప్రాంతాల్లో వాణిజ్య, పర్యాటక అభివృద్ధి జరుగుతుందన్నారు.