Share News

26న భ్రామరికి కుంభోత్సవం

ABN , Publish Date - Apr 19 , 2024 | 11:47 PM

శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 26న భ్రమరాంబాదేవికి కుంభోత్సవం నిర్వహించనున్నారు.

26న భ్రామరికి కుంభోత్సవం

శ్రీశైలం, ఏప్రిల్‌ 19: శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 26న భ్రమరాంబాదేవికి కుంభోత్సవం నిర్వహించనున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు శుక్రవారం కుంభోత్సవ ఏర్పాట్లపై సమావేశాన్ని నిర్వహించారు. స్థానిక రెవెన్యూ, పోలీసు, దేవస్థానం యూనిట్‌ అధికారులు, సెక్షన్‌ అధికారులు, వైదిక సిబ్బంది, తహసీల్దార్‌ గుర్రప్ప, సీఐ ప్రసాదరావు తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో డి. పెద్దిరాజు మాట్లాడుతూ కుంభోత్సవ వేడుకల కైంకర్యాలంన్నింటినీ పరిపూర్ణంగా జరిపించాలని వైదిక సిబ్బందికి సూచించారు. క్షేత్ర పరిధిలో జంతు బలులు జరగకుండా అఽధికారులు సహకరించాలని అన్నారు. కుంభోత్సవం సందర్భంగా మద్యం అమ్మకాలను నిలిపేస్తున్నట్లు ఉత్తర్వులు ఇవ్వాలని కలెక్టరును కోరాలని అన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 11:47 PM