Share News

ఘనంగా కోట్ల విజయభాస్కర్‌రెడ్డి జయంతి

ABN , Publish Date - Aug 17 , 2024 | 01:15 AM

మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి జయంతి వేడుకలను నగరంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా కోట్ల విజయభాస్కర్‌రెడ్డి జయంతి
కోట్ల సమాధికి పూలమాలలు వేసి నివాళి అర్పిస్తున్న ఎమ్మెల్యే గౌరు చరిత

కల్లూరు, ఆగస్టు 16: మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి జయంతి వేడుకలను నగరంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. శుక్రవారం కిసాన ఘాట్‌లోని కోట్ల సమాధి వద్దకు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత చేరుకుని పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆమె మాట్లాడుతూ మచ్చలేని నాయకుడు కోట్ల అని కొనియా డారు. కార్యక్ర మంలో రామలింగేశ్వరరెడ్డి, ఆకెపోగు వేంకటస్వామి పాల్గొన్నారు.

కర్నూలు(కల్చరల్‌): నీతి నిజాయితీకి మారుపేరుగా దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి నిలిచిపోతారని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు కె.బాబురావు అన్నారు. శుక్రవారం డీసీసీ కార్యాలయంలో కోట్ల జయంతిని ఘనంగా నిర్వహించారు. ముం దుగా డీసీసీ కార్యాలయంలో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి చిత్రపటానికి, అనం తరం కోట్ల సర్కిల్‌లోని కోట్ల కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివా ళులు అర్పించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ రాషా్ట్రన్ని అభివృద్ధి, సంక్షేమ పథంలో నడిపిన కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ప్రగతి పథంలో ఎన్నో మైలురాళ్లు సాధించి, పల్లెపల్లెకు తాగునీరు, సాగునీరు అందించారన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మూలిం టి మారెప్ప, మాజీ ఎమ్మెల్సీ ఎం.సుధాకర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే పి. మురళీ కృష్ణ, పీసీసీ ప్రధాన కార ్యదర్శి దామోదరం రాధాకృష్ణ, వివిధ అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.

కోడుమూరు: కోట్ల అభిమానుల ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి 104వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కోట్ల సర్కిల్లో ఆయన కాంస్య విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచు సీబీ లత, సర్పంచు భాగ్యరత్న, కోట్ల కౌశిక్‌రెడ్డి, మాజీ సర్పంచు కేఈ రాంబాబు, గోరంట్ల తిరుమల నాయుడు, రామ్మోహన్‌, హేమాద్రిరెడ్డి, మధుసూధన్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, వీరేష్‌, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

గూడూరు: గూడూరు పట్టణంలో కర్నూలు పార్లమెంటు తెలుగు యువత కార్యదర్శి చరణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాజారెడ్డి, చెట్టుకింది సురేష్‌, సంగాల మధు, వై.నాగరాజు, చెట్టుకింది నారాయణ పాల్గొన్నారు.

Updated Date - Aug 17 , 2024 | 01:15 AM