Share News

కార్యకర్తలకే న్యాయం చేయలేని కాటసాని

ABN , Publish Date - May 08 , 2024 | 01:07 AM

తనను నమ్ముకొన్న సొంత పార్టీ కార్యక ర్తలకే న్యాయం చేయలేని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి విమర్శించారు.

కార్యకర్తలకే న్యాయం చేయలేని కాటసాని
బహిరంగ సభలో మాట్లాడుతున్న బీసీ జనార్దన్‌రెడ్డి

దౌర్జన్యం చేస్తే ప్రతి చర్య తప్పదు

బీసీ నేత సుబ్బారావు హంతకులను వదలిపెట్టం

మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి

కొలిమిగుండ్ల రూరల్‌, మే 7: తనను నమ్ముకొన్న సొంత పార్టీ కార్యక ర్తలకే న్యాయం చేయలేని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం కొలిమిగుండ్లతో పాటు మం డలంలోని చింతలాయపల్లె గ్రామంలో బీసీ ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా రోడ్‌షో నిర్వహించారు. ఈసందర్భంగా బహిరంగ సభలో బీసీ మాట్లాడుతూ వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడితే చర్యకు ప్రతి చర్య తప్ప దని హెచ్చరించారు. బీసీ నేత వడ్డె సుబ్బారావును అన్యాయంగా హత్య చేశారని, హంతకులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని పేర్కొన్నారు. కొండలు, గుట్టలు, వంకలు, వాగులు ఆక్రమించుకున్నా కొలిమిగుండ్ల వైసీపీ నాయకులకు లేదని విమర్శించారు. వాల్మీకి సామాజిక వర్గం ప్రజలు గుడి నిర్మించుకుంటుంటే దాన్ని కూడా అడ్డుకోవడం సిగ్గు చేటన్నారు. టీడీపీ ప్రభు త్వం అధికారం చేపట్టగానే రామ్‌కో సిమెంట్‌ పరిశ్రమలో స్థానికులకు ఉద్యో గాలు వచ్చేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఇక్కడ జడ్పీ చైర్మన్‌ ఉన్నప్పటికీ ఎలాంటి అభివృద్ధి జరుగలేదని విమర్శించారు. రైతుల సొంత ఆస్తులైన పాసుపుస్తకాలపై ప్రచార యావతో జగన్‌ తన ఫొటోలు ముద్రిం చుకోవడం సిగ్గు చేటని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మూలే రమేశ్వరరెడ్డి, నంద్యాల రామేశ్వరరెడ్డి, వీఆర్‌ లక్ష్మీరెడ్డి, ఇటిక్యాల బాలిరెడ్డి, పులిప్రకాశ్‌రెడ్డి, ఉలవల నరసింహులు, నాగేశ్వరరెడ్డి, సీతారా మయ్య తదితరులు పాల్గొన్నారు.

చెల్లికి న్యాయం చేయని జగన్‌ ప్రజలకేం చేస్తారు: బైరెడ్డి శబరి

తన తండ్రి హత్య విషయంలో న్యాయం కోరుతున్న సొంత చెల్లెలు సునీతనే పట్టించుకోని సీఎం జగన్‌ రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారని నంద్యాల పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి ప్రశ్నించారు. మంగళవారం కొలిమిగుండ్ల రోడ్‌షోలో బీసీ జనార్దన్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. బీసీ ఇంది రమ్మ ప్రచారం చేస్తుంటే రెచ్చగొట్టి దాడికి పాల్పడడం సిగ్గు చేటని విమ ర్శిం చారు. వైసీపీ పాలనకు ఇక వారం మాత్రమే గడువుందని, రాష్ట్రంలో అధికా రంలోకి వచ్చేది కూటమి ప్రభుత్వమేనని బైరెడ్డి శబరి ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - May 08 , 2024 | 01:07 AM