మహానందిలో కర్ణాటక హైకోర్టు జడ్జి
ABN , Publish Date - May 12 , 2024 | 12:42 AM
మహానంది క్షేత్రంలో శనివారం కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ జి. బసవరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మహానంది, మే 11: మహానంది క్షేత్రంలో శనివారం కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ జి. బసవరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయం ముఖద్వారం వద్ద ఈవో కాపు చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం న్యాయమూర్తి దంపతులు ప్రధాన ఆలయాల్లో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకార్చనలు నిర్వహించారు. అనంతరం కల్యాణ మండపంలో వీరిని ఆలయ వేదపండితులు శాలువాతో సన్మానించి, స్వామివారి ప్రసాదాలు అందచేశారు. కార్యక్రమంలో ఏఈవో ఎర్రమల్ల మధు, సిబ్బంది పాల్గొన్నారు.