Share News

శాస్త్రోక్తంగా కామదహనం

ABN , Publish Date - Mar 24 , 2024 | 12:12 AM

శ్రీశైలం క్షేత్రంలో ఫాల్గుణ శుద్ధ చతుర్దశిని పురస్కరించు కుని శనివారం సాయంత్రం కామదహన కార్యక్రమాన్ని దేవస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించింది.

శాస్త్రోక్తంగా కామదహనం
కామదహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అర్చకులు, అధికారులు

శ్రీశైలం, మార్చి 23: శ్రీశైలం క్షేత్రంలో ఫాల్గుణ శుద్ధ చతుర్దశిని పురస్కరించు కుని శనివారం సాయంత్రం కామదహన కార్యక్రమాన్ని దేవస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించింది. ప్రధానాలయం ముందు భాగంలోని గంగాధర మండపం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా ఆలయంలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పల్లకీలో ఆశీనులను చేసి శాస్త్రోక్తంగా పూజాధికాలు జరిపి అనంతరం పల్లకీ సేవ నిర్వహించారు. పల్లకీ సేవలో భాగంగా ఉత్సవ మూర్తులను గంగాధర మండపం వద్దకు తోడ్కొని వచ్చి శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. తరువాత గడ్డితో చేయబడిన మన్మథ రూపాన్ని దహనం చేశారు.

Updated Date - Mar 24 , 2024 | 12:12 AM