Share News

సచివాలయ సిబ్బందితో జేసీ సమీక్ష

ABN , Publish Date - Feb 02 , 2024 | 12:25 AM

చాపిరేవుల గ్రామంలో జాయింట్‌ కలెక్టరు రాహుల్‌కుమార్‌ రెడ్డి గురువారం సచివాలయ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు.

సచివాలయ సిబ్బందితో జేసీ సమీక్ష
సచివాలయ సిబ్బందితో మాట్లాడుతున్న జేసీ

నంద్యాల రూరల్‌, ఫిబ్రవరి 1: చాపిరేవుల గ్రామంలో జాయింట్‌ కలెక్టరు రాహుల్‌కుమార్‌ రెడ్డి గురువారం సచివాలయ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. నవరత్నాల్లో భాగంగా నిరుపేదలకు మంజూరు చేసిన ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్‌, సంబంధిత అంశాలపై సచివాలయ సిబ్బందితో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 9వ తేదీ లోపు ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్‌ను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కాగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ సాఫ్ట్‌వేర్‌ కొత్తది కావడంతో కొంత జాప్యం ఏర్పడిందని, సమీక్షిస్తు న్నామని చెప్పారు. ఈ రిజిస్ట్రేషన్‌తో పాటు కన్వేయన్స్‌ డీడ్స్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రిజిస్ట్రేషన్‌ చేసిన ఆస్తిపై పది సంవత్సరాల తర్వాత సంపూర్ణ శాశ్వత హక్కులు వస్తాయన్నారు. కార్యక్రమంలో సబ్‌ రిజిస్ట్రార్‌ సునంద, వీఆర్వో బాలన్న, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 02 , 2024 | 12:25 AM