Share News

ప్రజలను మోసగించిన జగన్‌ : బీటీ నాయుడు

ABN , Publish Date - Apr 05 , 2024 | 11:57 PM

కేంద్ర నిధులు తనవిగా చెప్పుకొని గత ఐదేళ్ల కాలం ప్రజలను సీఎం జగన్‌రెడ్డి మోసం చేశారని టీడీపీ జిల్లా అధ్య క్షుడు బీటీ నాయుడు అన్నారు.

ప్రజలను మోసగించిన జగన్‌ : బీటీ నాయుడు

కర్నూలు(అర్బన్‌), ఏప్రిల్‌ 5: కేంద్ర నిధులు తనవిగా చెప్పుకొని గత ఐదేళ్ల కాలం ప్రజలను సీఎం జగన్‌రెడ్డి మోసం చేశారని టీడీపీ జిల్లా అధ్య క్షుడు బీటీ నాయుడు అన్నారు. టీడీపీ జిల్లా కార్యాల యంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లా డారు. 89 లక్షల రేషన్‌ కార్డులకు సరుకులను కేం ద్రం ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తున్నట్లు జగన్‌ ప్రచారం చేసుకుంటున్నారన్నారు. 8 రకాల సరుకుల సరఫరా చేస్తుండగా పేదలకు కేవలం బియ్యాన్నే సరఫరా చేస్తున్నారని తెలిపారు. కేంద్ర పఽథకం జల్‌జీవన్‌ ద్వారా గత టీడీపీ ప్రభుత్వం హయంలో పంచాయతీ రాజ్‌ మంత్రిగా ఉన్న నారా లోకేష్‌ నిధులు తెచ్చి వందల కొద్ది ట్రాక్టర్ల ద్వారా తాగునీటి సరఫరా చేయించారన్నారు. చంద్ర బాబు హయంలో సంక్షేమ పథకాలకు బడ్జెట్‌ లో 19 శాతం నిధులు ఖర్చు చేస్తే జగన్‌ హయంలో కేవలం 15 శాతం మాత్రమే సున్నా వడ్డీ కింద రూ. 5 లక్షల వరకు రుణం అందిస్తే జగన్‌రెడ్డి 3 లక్షలకు కుదించారన్నారు. అన్న క్యాంటిన్లు రద్దు చేయడంతోపాటు రైతు రుణ మాఫీ అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి, చంద్రన్న బీమా, పండుగ కానుకలు, వాటిని ప్రజలకు దూరం చేశారని ఆయన తెలిపారు. కోడి కత్తి డ్రామా, బాబాయి హత్యలో తాడే పల్లి కుట్రల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి పింఛన్లపై కుట్ర చేశారని బీటీ నాయుడు మండిపడ్డారు.

Updated Date - Apr 05 , 2024 | 11:57 PM