Share News

పేదలను జలగలా పీల్చేస్తున్న జగన్‌

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:55 PM

పన్నుల రూపంలో పేదల రక్తాన్ని జల గలా సీఎం జగన్‌ పీలుస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి విమర్శిం చారు.

పేదలను జలగలా పీల్చేస్తున్న జగన్‌

మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి

బనగానపల్లె, ఏప్రిల్‌ 26: పన్నుల రూపంలో పేదల రక్తాన్ని జల గలా సీఎం జగన్‌ పీలుస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి విమర్శిం చారు. శుక్రవారం బనగానపల్లె పట్టణంలోని అవుకుమెట్ట, పింజరిపేట, జెండామాను ఏరియాలో ప్రజాగళం ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని బీసీ పాల్గొన్నారు. ప్రజాగళంలో బీసీ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ వైసీపీని ఓడిం చేందుకు జనం సిద్ధంగా ఉన్నారన్నారు. బీసీకి టీడీపీ, జనసేన శ్రేణులు ఘనస్వాగతం పలికారు. బీసీ మాట్లాడుతూ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి కౌంట్‌డౌన్‌ మొదలైందన్నారు. 15 రోజుల్లో వైసీపీ దురాగతాలకు అంతం పలికే సమయం ఆసన్నమైందని బీసీ అన్నారు. వైసీపీ ఏపీని పూర్తిగా నాశనం చేసిందని అన్నారు. ఇలాంటి పార్టీ ప్రజలకు అవసరం లేదని బీసీ అన్నారు. రాష్ట్రంలో వైసీపీ బాధితులు, నష్టపోయిన రైతులు, నిరుద్యోగ యువత, మహిళలు టీడీపీ స్టార్‌ క్యాంపెయినర్లని అన్నారు. వైసీపీ అరాచక పాలనను ప్రతి గడపకు వెళ్లి వివరించి టీడీపీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

టీడీపీలో చేరిన వైసీపీ రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ

కొలిమిగుండ్ల మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన వైసీపీ రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ ఇటిక్యాల బాలిరెడ్డి తన అనుచరులు 200 కుటుంబాల వారితో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. బాలిరెడ్డికి, ఆయన కుమారులకు, అనుచరులకు బీసీ టీడీపీ కండు వాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కొలిమిగుండ్లకు చెందిన కదిరి చంద్ర శేఖర్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, కృష్ణప్రసాద్‌రరెడ్డి, కదిరి రామాంజనేయరెడ్డి తదితర పది కుటుంబాలవారు బీసీ జనార్దన్‌రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. అలాగే హుసేనాపురం జహంగీర్‌ ఆధ్వర్యంలో గడ్డం హుసేన్‌బాషా, ఇదూర్‌సావలి, మహబూబ్‌షరీఫ్‌ తదితరులు టీడీపీలో చేరారు. హుసే నాపురం గ్రామానికి చెందిన బుడ్డేహుసేన్‌సా, ఆకుల హుసేన్‌సా, బజ్జిహు సేన్‌బీ, గుల్లగుర్తి గ్రామానికి చెందిన వలంటీర్లు పోరుమామిళ్ళ శ్రీధర్‌, నాగే శ్వరరెడ్డి, ఆబూసి వెంకటేశ్‌ తదితరులు టీడీపీలో చేరారు.

Updated Date - Apr 26 , 2024 | 11:55 PM