Share News

‘జగన్‌రెడ్డికి యావజ్జీవం తప్పదు’

ABN , Publish Date - Jan 14 , 2024 | 12:16 AM

సీఎం జగన్మోహన్‌రెడ్డికి యావజ్జీవ శిక్ష తప్పదని జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు అన్నారు.

‘జగన్‌రెడ్డికి యావజ్జీవం తప్పదు’

కర్నూలు(అర్బన్‌), జనవరి 13: సీఎం జగన్మోహన్‌రెడ్డికి యావజ్జీవ శిక్ష తప్పదని జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు అన్నారు. శనివారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్‌ రెడ్డిపై తీవ్ర నేరారోప ణలతో 38 కేసులు నమోదయ్యాయని, రూ. 43 వేల కోట్ల దోపిడీపై సీబీఐ, ఈడీ జార్జీ షీటు కూడా వేశా యని తెలిపారు. ఈ కేసుల నుంచి జగన్‌ తప్పించుకునే అవకాశం లేదని, యావజ్జీవ శిక్ష తప్పదని అన్నారు. ఆర్థిక నేరాలకు పాల్పడిన కేసుల్లో ఇప్పటికి 12 సంవత్సరాల కాలంగా 3,500 పర్యాయాలు తప్పించు కున్నారని, ఇది దేశంలోనే చరిత్రగా నిలిచిందని, నేరం చేయపోతే కోర్టుకు హాజరై తీర్పు పొందేవారని, నేరాలు చేసినందువల్లే ఇలా తప్పించుకు తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. జగన్‌ ఒత్తిడితో చంద్రబాబుపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారని అన్నారు. చంద్రబాబు వ్యక్తిగతంగా ఆర్థిక ప్రయోజనం పొంది నట్లు సీఐడీ ఎలాంటి ఆధారాలు కోర్టుకు చూపించ లేకపోయిందని తెలిపారు. ఇలాంటి సంఘటనలు ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు

జిల్లా ప్రజలకు తెలుగు దేశం పార్టీ తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు తెలిపారు. శనివారం జిల్లా తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో సంక్రాంతి సందర్భంగా నూతన సంవత్సరం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రంమంలో కోడుమూరు ఇన్‌చార్జి ఆకెపోగు ప్రభాకర్‌, రాష్ట్ర కార్యదర్శులు పీజీ నరసింహులు యాదవ్‌ నంద్యాల నాగేంద్ర, కే తిరుపాల్‌ బాబు, బుర్రా ఈశ్వరయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 14 , 2024 | 12:16 AM