ఇది సంక్షోభ రాష్ట్రం: బీసీ
ABN , Publish Date - Feb 06 , 2024 | 12:42 AM
పన్నుల బాదుడుతో రాష్ట్ర ప్రజల రక్తం పీలుస్తూ, మాయమాటలు చెప్తున్న సీఎం జగన్ వల్ల ఏపీ సంక్షోభ రాష్ట్రంగా మారిందని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి మండిపడ్డారు.
బనగానపల్లె, ఫిబ్రవరి 5: పన్నుల బాదుడుతో రాష్ట్ర ప్రజల రక్తం పీలుస్తూ, మాయమాటలు చెప్తున్న సీఎం జగన్ వల్ల ఏపీ సంక్షోభ రాష్ట్రంగా మారిందని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం పలుకూరులో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొని ఇంటింటి ప్రచారం గావించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీసీ మాట్లాడుతూ అన్న క్యాంటీన్‌లు రద్దు చేసి, పండుగ కానుకలు, చంద్రన్న బీమావంటి పెళ్లి కానుకలు, పీజు రీయంబర్స్‌మెంట్, రైతులకు సబ్సిడీ రుణాలు, దళిత, బీసీ, ఎస్సీల సంక్షేమ పథకాలు వందకు పైగా రద్దు చేశారన్నారు. జగన్‌ను రాష్ట్ర ప్రజలు రెండు నెలల్లో ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబు ప్రకటించిన ఆరు సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు. మాజీ ఎంపీపీ అంబాల రామకృష్ణారెడ్డి, చల్లామద్దిలేటి, గుండం మల్లికార్జునరెడ్డి, మండ్ల కృష్ణారెడ్డి, మధుసూదన్‌రెడ్డి వల్లపుశంకర్, జిల్లెల్ల వెంకటరామిరెడ్డి, గగ్గెర అరుణ, మాసన్న గౌడ్, ఉప్పరి గురువయ్య ఽఅధిక సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
టీడీపీలో చేరిక
బనగానపల్లె, పిబ్రవరి 5! బనగానపల్లె నియోజకవర్గం కొలిమిగుండ్లకు చెందిన 50 వైసీపీ కుటుంబాలు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారు. బనగానపల్లె టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వీరికి బనగానపల్లె టీడీపీ కార్యాలయంలో ఆయన పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కొలిమిగుండ్లకు చెందిన ఉలువల రామలక్ష్మయ్య, ఉలువల నరసింహులు, ఉలవల బాలన్న, వెంకట్రాములు, దేవరకొండ వన్నూరప్ప, తలారి కంబగిరి, తలారి సూర్యనారాయణ, తలారి నాగార్జున, 5వ వార్డు సభ్యురాలు మాధవి, ఆయన భర్త సూర్యుడుతో పాటు 50 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రుద్రవరం: రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని మాజీమంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. సోమవారం రుద్రవరంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీలో భాగంగా ఇంటింటికీ తిరిగి మేనిఫెస్టో కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాబోయే ప్రభుత్వం టీడీపీ, కాబోయే సీఎం చంద్రబాబునాయుడేనని అన్నారు. వైసీపీ పాలనలో ప్రజలు విసుగు చెందారని అన్నారు.
మండలంలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ఉత్తమ సభ్యులుగా గుర్తించిన టి.లింగందిన్నె గ్రామానికి చెందిన ఓబులేసు, రుద్రవరం గ్రామానికి చెందిన దస్తగిరిలకు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పతకాలు అందించారు.
చాగలమర్రి: రాష్ట్రంలో టీడీపీతోనే పేదల సంక్షేమం సాధ్యమని టీఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శి గుత్తి నరసింహులు అన్నారు. సోమవారం చాగలమర్రి గ్రామంలోని కుమ్మరి వీధిలో 212 పోలింగ్ కేంద్రం పరిధిలో బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ సూపర్-6 పథకాల గురించి ప్రజలకు వివరించారు. టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అరాచక పాలనకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. టీడీపీ అధికారం తఽథ్యమని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు షేక్.మహబూబ్, ఖాజా, రవి, మహిళలు పాల్గొన్నారు.
డోన్: వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా యువతను వంచించిదని డోన్ నియోజకవర్గ యువనాయకుడు ధర్మవరం భరత్‌రెడ్డి, టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు గంధం శ్రీనివాసులు అన్నారు. సోమవారం పట్టణంలోని 23వ వార్డులో టీడీపీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కరపత్రాలను పంపిణీ చేశారు. భరత్‌రెడ్డి మాట్లాడుతూ ఏటా జాబ్‌క్యాలెండర్ విడుదల చేస్తానని జగన్ మాటిచ్చి నిరుద్యోగులను మోసం చేశారన్నారు. గంధం శ్రీనివాసులు మాట్లాడుతూ సీఎం జగన్ నోటీఫికేషన్ల పేరుతో కొత్త డ్రామా అడుతున్నారని, యువత నమ్మే పరిస్థితి లేరని అన్నారు. కార్యక్రమంలో నాయకులు నీలం ప్రభాకర్, ఎల్‌ఐసీ శ్రీరాములు, నాగేంద్ర, గంధం చరణ్ పాల్గొన్నారు.