జాతీయ విపత్తుగా ప్రకటించాలి
ABN , Publish Date - Sep 10 , 2024 | 12:56 AM
భారీ వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని జాతీయ విపత్తుగా ప్రకటించాలని అఖల భారత రైతు సంఘం జిల్లా నాయకుడు బోయ మునిస్వామి డిమాండ్ చేశారు.
ఆలూరు రూరల్, సెప్టెంబరు 9: భారీ వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని జాతీయ విపత్తుగా ప్రకటించాలని అఖల భారత రైతు సంఘం జిల్లా నాయకుడు బోయ మునిస్వామి డిమాండ్ చేశారు. సోమవారం తుంబలబీడు గ్రామంలో పంటలను పరిశీలించారు. వ్యవసాయ అధికారులు పరిశీలించి నివేదిక ఇవ్వాలని కోరారు. పత్తి పంటకు ఎకరాకు రూ.40 వేలు ఇవ్వాలన్నారు. నాగరాజు, రంగన్న, ఉచ్చప్ప, వీరాంజినేయులు పాల్గొన్నారు.