Share News

ఈవీఎం గోడౌన్ల పరిశీలన

ABN , Publish Date - Mar 28 , 2024 | 12:39 AM

కలెక్టరేట్‌ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్లను బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి జి.సృజన మున్సిపల్‌ కమిషనర్‌ భార్గవ్‌ తేజ, డీఆర్వో కే.మధుసూదన్‌రావులతో కలిసి పరిశీ లించారు.

ఈవీఎం గోడౌన్ల పరిశీలన

కర్నూలు(కలెక్టరేట్‌), మార్చి 27: కలెక్టరేట్‌ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్లను బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి జి.సృజన మున్సిపల్‌ కమిషనర్‌ భార్గవ్‌ తేజ, డీఆర్వో కే.మధుసూదన్‌రావులతో కలిసి పరిశీ లించారు. ఈసం దర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ భారత ఎన్నికల సం ఘం ఆదేశాల మేరకు కలెక్టరేట్‌లోని ఈవీఎం గోడౌన్లను, స్ర్టాంగ్‌ రూంలను ప్రతి మూ డు నెలలకు ఒకసారి పరిశీలిస్తామన్నారు. మే 13న పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో మే 1న ఈవీఎంల ర్యాం డమైజేషన్‌ జరిగి అదేరోజు జిల్లాలోని 8 నియోజకవర్గాలకు ఈవీఎం లను పోలీసు బందోబస్తు మధ్య పంపుతామన్నారు. ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్‌ మురళి, వైసీపీ ప్రతి నిధి కె.పుల్లారెడ్డి, టీడీపీ ప్రతినిధి ఎల్‌వీ ప్రసాద్‌, బీజేపీ ప్రతినిధి సాయి ప్రదీప్‌, సీపీఐ కేవీ నారాయణ, కాంగ్రెస్‌ ప్రతినిధి జాన్‌విల్సన్‌, బీఎస్‌పీ ప్రతినిధి అరుణ్‌కుమార్‌, ఆప్‌ పార్టీ ప్రతినిధి మహ్మద్‌ ఆలీ పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2024 | 12:39 AM