Share News

ఉపాధి పనుల పరిశీలన

ABN , Publish Date - May 17 , 2024 | 12:40 AM

కల్లూరు మండలం తడకనపలె, పెద్దటేకూరు గ్రామాల్ల్లో ఉపాధి హామీ పనులను డ్వామా పీడీ అమర్‌నాథ్‌ రెడ్డి గురువా రం పరిశీలించారు.

ఉపాధి పనుల పరిశీలన

కల్లూరు, మే 16: కల్లూరు మండలం తడకనపలె, పెద్దటేకూరు గ్రామాల్ల్లో ఉపాధి హామీ పనులను డ్వామా పీడీ అమర్‌నాథ్‌ రెడ్డి గురువా రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఉపాధి హామీ పనులు కల్పించాలని ఆదేశించారు. ప్రతి రోజూ 4600 మంది కూలీలు హాజరు కావాల్సి ఉండగా 3వేల మంది పనులకు వస్తున్నారన్నారు. ప్రతి కుటుంబానికి జూన్‌ 1 లోపు 75 పనిదినాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఉపాధి కూలీలకు వేతనాలు సకాలంలో అందజేస్తున్నామని, అర్హత ఉన్న వారందరూ ఉపాధి పనుల్లో పాల్గొనాలని ఆయన సూచించారు. ఆయన వెంట ఏపీఓ మద్దీశరమ్మ ఉన్నారు.

Updated Date - May 17 , 2024 | 12:40 AM