Share News

జగన్‌ పాలనలో రైతులకు అన్యాయం: బైరెడ్డి

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:54 AM

జగన్‌ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసిందని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఆరోపించారు.

జగన్‌ పాలనలో రైతులకు అన్యాయం: బైరెడ్డి
సమావే శంలో మాట్లాడుతున్న బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి

పాణ్యం, ఏప్రిల్‌ 24: జగన్‌ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసిందని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం బలపనూరులో ఏర్పాటు చేసిన రైతుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బైరెడ్డి మాట్లాడు తూ జగన్‌ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఒక్క కొత్త సాగునీటి ప్రాజెక్టులు గానీ, పరిశ్రమలు గానీ చేపట్టలేదన్నారు. దీంతో రైతాంగం, నిరుద్యోగులు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారన్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయలేదని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులే రైతులకు ఊపిరి అన్నారు. గోరుకల్లు రిజర్వాయర్‌ నిర్మాణ పూర్తికి అవసరమైన వంద కోట్లరూపాయలు మంజూరు చేయకపోగా నిర్మాణం శిథిలమయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. రిపేరీలకూ నిధులు మంజూ రు చేయలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉండడం సిగ్గుచేటన్నారు. టీడీపీ హయాంలోనే ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతంగా సాగాయన్నారు. పోలవరం, గోదావరి ఎత్తిపోతల, అవుకు తదితర ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతంగా జరిగాయన్నారు. నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డికి చెందిన భారతీ సీడ్స్‌లో అంతా అక్రమాలే అన్నారు. కల్తీ విత్తనాలు పంపిణీ చేసి రైతులను నట్టేట ముంచారని ఆరోపించారు. నంద్యాల టీడీపీ ఎంపీగా పోటీ చేస్తున్న బైరెడ్డి శబరి తోపాటు అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. జిల్లాలోని అన్ని వర్గాల సమస్యలపై గురువారం నంద్యాల టీడీపీ కార్యాలయంలో జరిగే సమావేశానికి రైతులు, కార్మికలు, నిరుద్యోగులు, తదితర వర్గాలు హాజరు కావాలని కోరారు. గోరుకల్లు, బలపనూరు, పాణ్యం గ్రామాలకు చెందిన రైతులు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 12:54 AM