Share News

బయలు వీరభద్రస్వామికి ఆర్జిత పరోక్ష సేవ

ABN , Publish Date - Jun 06 , 2024 | 12:25 AM

శ్రీశైల మహక్షేత్రంలో బుధవారం అమావాస్య ఘడియలను పురస్కరించుకొని సాయంత్రం శ్రీశైలక్షేత్రపాలకుడైన బయలు వీరభద్ర స్వామికి పరోక్ష సేవగా విశేష అభిషేక పూజలు చేశారు.

బయలు వీరభద్రస్వామికి ఆర్జిత పరోక్ష సేవ
వీరభద్రస్వామికి పూజలు చేస్తున్న అర్చకులు

శ్రీశైలం, జూన్‌ 5: శ్రీశైల మహక్షేత్రంలో బుధవారం అమావాస్య ఘడియలను పురస్కరించుకొని సాయంత్రం శ్రీశైలక్షేత్రపాలకుడైన బయలు వీరభద్ర స్వామికి పరోక్ష సేవగా విశేష అభిషేక పూజలు చేశారు. కార్యక్రమంలో మహాగణపతికి ప్రత్యేక పూజాధికాలు నిర్వహించి వీరభద్రస్వామికి పంచామృతాల తోనూ, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మో దకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధజలాలతో వీరభద్ర స్వామికి విశేష అభిషేక పూజలు నిర్వహించారు. స్వామి పరోక్షసేవలో మొత్తం 16 మంది భక్తులు ఆన్‌లైన్‌ ద్వారా రూ. 1,116 సేవారుసుమును చెల్లించి జరిపించుకున్నారు. శ్రీశైల క్షేత్రానికి స్వయంగా విచ్చేయలేని భక్తులు పాల్గొనేందుకు దేవస్థానం ఈ పరోక్షసేవల ద్వారా అవ కాశం కల్పించింది. ప్రతి నెల అమావాస్య రోజులలో బయలువీరభద్రస్వామికి జరిపే పరోక్ష సేవలో భక్తులు పాల్గొనవచ్చని దేవస్థానం ఈవో డి. పెద్దిరాజు తెలిపారు. దేవస్థానం వెబ్‌సైట్‌ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ.శ్రీశైలదేవస్థానం. ఒఆర్‌జీ ద్వారా ఒక్కో పూజకు రూ. 1,116 సేవా రుసుమును చెల్లించి ఏ సేవలో అయిన పాల్గొనవచ్చు. స్వామి రుద్రాభిషేకం, అమ్మవారి కుంకు మార్చన మినహ మిగతా అన్నీ సేవలను భక్తులు శ్రీశైల టీవీ, యూట్యూబ్‌ చానెల్‌ ద్వారా వీక్షించవచ్చునని తెలిపారు.

Updated Date - Jun 06 , 2024 | 12:25 AM