పెరిగిన ఉల్లి ధర
ABN , Publish Date - Oct 20 , 2024 | 12:06 AM
వర్షాలతో ఉల్లి రైతులు ఆందోళన చెందుతున్నా ధరలు ఆశాజనకంగా పెరుగుతుండటంతో ఊరట చెందుతున్నారు.
కర్నూలు అగ్రికల్చర్, అక్టోబరు 19, (ఆంధ్రజ్యోతి): వర్షాలతో ఉల్లి రైతులు ఆందోళన చెందుతున్నా ధరలు ఆశాజనకంగా పెరుగుతుండటంతో ఊరట చెందుతున్నారు. శనివారం కర్నూలు మార్కెట్ యార్డుకు వివిధ ప్రాంతాల నుంచి 4,643 క్వింటాళ్ల ఉల్లిని రైతులు విక్రయానికి తెచ్చారు. వారం క్వింటానికి గరిష్టంగా నాలుగు వేలు మాత్రమే చేతికి అందింది. శనివారం గరిష్టంగా రూ.4,329, మధ్యస్థ ధర రూ.3,591, కనిష్ట ధర రూ.495 అందడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఎండుమిరప కాయలకు కూడా మంచి ధర లభిస్తుంది. క్వింటానికి గరిష్ట ధర రూ.9,229, మధ్యస్థ ధర రూ.8,613, కనిష్ఠ ధర రూ.3,629 రైతులకు అందినట్లు సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు. కొర్రలకు గరిష్టంగా రూ.3,401ు, మధ్యస్థ ధర రూ.2,920, కనిష్ట ధర రూ.2,009 లభించింది. మినుములకు గరిష్టంగా రూ.7,469, మధ్యస్థ ధర రూ.7,469, కనిష్ట ధర రూ.3,900 రైతులకు దక్కింది. సజ్జలు గరిష్టంగా రూ.2,149, మధ్యస్థ ధర రూ.2,139, కనిష్ట ధర రూ.2,088 వచ్చింది. మొక్కజొన్నలకు గరిష్టంగా రూ.2,249, మధ్యస్థ ధర రూ.2,181, కనిష్ట ధర రూ.1,809 ధర దక్కింది. వేరుశనగ కాయలకు గరిష్టంగా రూ.6,710, మధ్యస్థ ధర రూ.6,645, కనిష్ట ధర రూ.3,354 ధర లభించింది. ఆముదాలకు గరిష్టంగా రూ.6,018, మధ్యస్థ ధర రూ.5,919, కనిష్ట ధర రూ.5,329 వచ్చింది. కందులకు గరిష్టంగా రూ.9,209, మధ్యస్థ ధర రూ.8,341, కనిష్ట ధర రూ.7,309 దక్కింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు కర్నూలు మార్కెట్ యార్డులో రైతులకు దక్కుతుండటంపై సెక్రటరీ జయలక్ష్మి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.