పెంచిన విద్యుత చార్జీలను తగ్గించాలి: ఎమ్మెల్యే
ABN , Publish Date - Dec 28 , 2024 | 01:05 AM
కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత చార్టీలను తగ్గించాలని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి డిమాండ్ చేశారు.

మంత్రాలయం, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత చార్టీలను తగ్గించాలని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం వైసీపీ రాష్ట్ర పిలుపు మేరకు మంత్రాలయంలో రాఘవేంద్ర సర్కిల్ నుంచి విద్యుత సబ్ స్టేషన వరకు విద్యుత చార్జీల బాదుడుపై పోరుబాట కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యుత ఏడీఏ విశ్వశాంతి స్వరూప్, ఏఈ గోవిందులకు వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, ఎన్నికల్లో ఇచ్చి న హామీలను నెరవేర్చి ప్రజలకు సంక్షేమం అందించాలన్నారు. 2027లో జరిగే జమిలీ ఎన్నికల్లో 5వ సారి ఎమ్మెల్యేగా గెలిచితీరుతానని తెలిపారు. ప్రజల సంక్షేమాన్ని చంద్రబాబు పట్టించుకోవడం లేదని, సంపద సృష్టిం చి ప్రజలకు అందిస్తానన్న మాటకు కట్టుబడి ఉండాలన్నారు. కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ గుర్రెడ్డి భీమిరెడ్డి, సర్పంచులు తెల్లబండ్ల భీమయ్య, రామాంజనేయులు, కురువ లింగారెడ్డి, బెస్త ఆంజనేయ, వీరారెడ్డి, పురుషోత్తంరెడ్డి, కరణం గురురాజరావు, జనార్దన రెడ్డి, లక్ష్మినారాయణ రెడ్డి, ప్రహ్లాద దేశాయ్, రోగెప్ప, బెట్టన్నగౌడు, చంద్ర, నాలుగు మండలాల నుంచి వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పెంచిన విద్యుత చార్జీలను ఉపసంహరించుకోవాలి
ఎమ్మిగనూరు టౌన: రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత చార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఎమ్మిగనూరు నియోజకవర్గ వైసీపీ ఇనచార్జి బుట్టరేణుక అన్నారు. వైసీపీ అధిష్టానం ఆదేశాల మేరకు శుక్రవారం శ్రీనివాస సర్కిల్ నుంచి కమిటీ రోడ్డు మీదుగా విద్యుత కార్యాలయానికి కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి డీఈ నాగేంద్రప్రసాద్‌కు వినతి పత్రం అందజేశారు. బుట్టా రేణుక మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుతను కొనసాగించా లన్నారు. గృహ వినియోగదారులపై మోపిన రూ.15,48,536 కోట్ల విద్యుత చార్జీల బాదుడును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో బహిరంగంగా ప్రజలకు విద్యుత చార్జీలు పెంచము వీలైతే తగ్గిస్తామని చెప్పి ఇప్పుడు ప్రజల నడ్డి విరిచేలా కరెంట్ చార్జీలు పెంచడం సరైందికాదన్నారు. కార్యక్రమంలో వీరశైవ లింగాయత రాష్ట్ర అధ్యక్షులు వై రుద్రగౌడ్, మండల కన్వీనర్ బసిరెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీకాంతరె డ్డి, శివారెడ్డి, సునీల్,నజీర్ పాల్గొన్నారు.