Share News

చెక్‌పోస్టులలో నిఘా పెంచండి

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:47 AM

జిల్లా సరిహద్దులో ఉండే చెక్‌పోస్టులలో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని జనరల్‌ అబ్జర్వర్లు జాఫర్‌, సీ. మీర్‌ తారీఖ్‌ ఆలీ, పోలీసు అబ్జర్వర్‌ ఉమేష్‌ కుమార్‌, ఎస్పీ జి. కృష్ణకాంత్‌కు సూచించారు.

చెక్‌పోస్టులలో నిఘా పెంచండి

కర్నూలు(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 29: జిల్లా సరిహద్దులో ఉండే చెక్‌పోస్టులలో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని జనరల్‌ అబ్జర్వర్లు జాఫర్‌, సీ. మీర్‌ తారీఖ్‌ ఆలీ, పోలీసు అబ్జర్వర్‌ ఉమేష్‌ కుమార్‌, ఎస్పీ జి. కృష్ణకాంత్‌కు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్లో ఎన్నికల నిర్వహణ సందర్భంగా పోలింగ్‌ భద్రతా ఏర్పాట్లు గురించి జనరల్‌ అబ్జర్వర్లు జాఫర్‌, సి. మీర్‌ తారీఖ్‌ ఆలీ, పోలీస్‌ అబ్జర్వర్‌ ఉమేష్‌ కుమార్‌లకు కలెక్టర్‌ డా.జి. సృజనతో కలిసి ఎస్పీ కృష్ణకాంత్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు.

Updated Date - Apr 30 , 2024 | 12:47 AM