వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్‌లో ఎస్పీ
ABN , Publish Date - Dec 28 , 2024 | 11:20 PM
నంద్యాల జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కర్నూలు మండలం దిన్నెదేవరపాడు గ్రామ పొలిమేరలోని జగన్నాఽథగట్టు సమీపంలోని ఫైరింగ్ రేంజ్‌లో జిల్లాలోని పోలీసు అధికారులు ఈ ఏడాదికి సంబంధించిన ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. ఈ సాధనలో ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, ఏఎస్పీ ఎన్. యుగంధర్‌బాబు పాల్గొని పిస్టల్‌తో ఫైరింగ్ సాధన చేశారు.

నంద్యాల క్రైం, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కర్నూలు మండలం దిన్నెదేవరపాడు గ్రామ పొలిమేరలోని జగన్నాఽథగట్టు సమీపంలోని ఫైరింగ్ రేంజ్‌లో జిల్లాలోని పోలీసు అధికారులు ఈ ఏడాదికి సంబంధించిన ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. ఈ సాధనలో ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, ఏఎస్పీ ఎన్. యుగంధర్‌బాబు పాల్గొని పిస్టల్‌తో ఫైరింగ్ సాధన చేశారు. అలాగే పోలీసు అధికారులు తమ విధుల్లో వినియోగిస్తున్న ఆయుధాల పనితీరుపై పరిజ్ఞానం పెంచుకోవాలని ఫైరింగ్ ప్రాక్టీస్‌లో పోలీసులు విధి నిర్వహణలో వినియోగించే ఆయుధాలతో ఫైరింగ్ చేయించారు. ఎస్పీ మాట్లాడుతూ ఫైరింగ్‌లో సిబ్బంది పాల్గొని మంచి మెలకువలు చేర్చుకోవాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు చాలా కీలకమైనవన్నారు. అత్యవసర సమయాల్లో ప్రజల మాన, ధన, ప్రాణ రక్షణకై ఎల్లవేళలా సంసిద్ధులై ఉండాలని పిలుపునిచ్చారు. ఫైరింగ్‌లో ప్రతిభ కనబరచిన పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ, ఏఎస్పీలతోపాటు జిల్లా సాయుధ బలగాల అడిషనల్ లెఫ్ట్ చంద్రబాబు, డీఎస్పీలు శ్రీనివాస్‌రెడ్డి, రామంజినాయక్, రవికుమార్, శ్రీనివాస్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు మంజునాథ్, శ్రీనివాసులు, నాగభూషణంతోపాటు జిల్లాలోని పోలీసు అధికారులు పాల్గొన్నారు.