Share News

ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు రద్దు చేయాలి

ABN , Publish Date - Mar 18 , 2024 | 12:14 AM

ఉపాధ్యాయ అక్రమ బదిలీలను రద్దు చేయాలని డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షుడు కరెకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి గట్టు తిమ్మప్ప, రాష్ట్ర కార్యదర్శి గోట్ల చంద్రశేఖర్‌ డిమాండ్‌ చేశారు.

ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు రద్దు చేయాలి

కర్నూలు(ఎడ్యుకేషన్‌), మార్చి 17: ఉపాధ్యాయ అక్రమ బదిలీలను రద్దు చేయాలని డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షుడు కరెకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి గట్టు తిమ్మప్ప, రాష్ట్ర కార్యదర్శి గోట్ల చంద్రశేఖర్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక డీటీఎఫ్‌ జిల్లా కార్యాలయంలో జరిగిన సమా వేశంలో వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం గురించి అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో పొందుపరచాలని కోరారు. గత ఏడాది పదో తరగతి మూల్యాంకనం రెమ్యునరేషన్‌ వెంటనే విడుదల చేయా లని, 58 సంవత్సరాలు పైబడిన వారిని, ఆరోగ్య సమస్యలున్న వారికి పది పరీక్షల డ్యూటీలలో మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా డీటీఎఫ్‌ నాయకులు రామన్న, వెంకట్రాముడు, పాటిల్‌ ఈశ్వర్‌ రెడ్డి, వెంకటే శప్ప, నాగరాజుగౌడు, గంగాధర్‌, చంద్రశేఖరయ్య పాల్గొన్నారు.

Updated Date - Mar 18 , 2024 | 12:14 AM