Share News

మద్యం అక్రమ నిల్వలను గుర్తించాలి

ABN , Publish Date - Apr 07 , 2024 | 12:26 AM

మద్యం అక్రమ నిల్వలను గుర్తించి చర్యలు చేపట్టాలని సెబ్‌ రాష్ట్ర కమిషన్‌ కార్యాలయ డిప్యూటీ కమిషనర్‌ నాగమద్దయ్య ఆదేశించారు.

మద్యం అక్రమ నిల్వలను గుర్తించాలి

డిప్యూటీ కమిషనర్‌ నాగమద్దయ్య

డోన్‌(రూరల్‌), ఏప్రిల్‌ 6: మద్యం అక్రమ నిల్వలను గుర్తించి చర్యలు చేపట్టాలని సెబ్‌ రాష్ట్ర కమిషన్‌ కార్యాలయ డిప్యూటీ కమిషనర్‌ నాగమద్దయ్య ఆదేశించారు. శనివారం డోన్‌ పట్టణంలోని సెబ్‌ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. అనంతరం సెబ్‌ పోలీసులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సెబ్‌ పోలీసులు అవిశ్రాంతంగా పని చేయాలన్నారు. అక్రమ మద్యం, నాటుసారా స్థావరాలపై దాడులు చేసి కేసులు నమోదు చేయాలన్నారు. విధుల పట్ల అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సారా విక్రేతలపై నిఘా పెంచాలని ఆదే శించారు. ఈ సమావేశంలో డోన్‌ సెబ్‌ సీఐ జయనాథరెడ్డి, సెబ్‌ ఎస్‌ఐ సోమశేఖర్‌రావు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2024 | 12:26 AM