Share News

జగన్‌కు ఓటు వేస్తే ఆస్తులు ఉండవు: కోట్ల

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:01 AM

సీఎం జగన్‌కు మళ్లీ ఓటు వేస్తే ప్రజల ఆస్తులు ఉండవని కేంద్ర మాజీ మంత్రి, డోన్‌ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి అన్నారు.

జగన్‌కు ఓటు వేస్తే ఆస్తులు ఉండవు: కోట్ల
మాట్లాడుతున్న కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి

డోన్‌, ఏప్రిల్‌ 26: సీఎం జగన్‌కు మళ్లీ ఓటు వేస్తే ప్రజల ఆస్తులు ఉండవని కేంద్ర మాజీ మంత్రి, డోన్‌ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని తన నివాసంలో మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మతోపాటు పార్టీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. సీఎం జగన్‌ దోపిడీ విధానాలతో రాష్ట్రం సర్వనాశనమైందన్నారు. ఉచితంగా దొరికే ఇసుకను మాఫీయా చేతులతో కలిపి సీఎం జగన్‌ ఆయన మంత్రులు వేల కోట్లు దండుకున్నారని ఆరోపించారు. ప్రజలకు పని చేయాల్సిన వైసీపీ ప్రభుత్వం అవినీతి అక్రమాల్లో మునిగిపోయి, ప్రజల డబ్బులను జలగలా పీల్చివేశారని ధ్వజమెత్తారు. డోన్‌ నియోజకవర్గంలో నీతికి, అవినీతికి మధ్య పోరాటం జరుగుతోందన్నారు. ప్రజలు బుగ్గన లాంటి దొరల పాలన కోరుకో వడం లేదన్నారు. మంత్రి బుగ్గనను కలిసి ఏమైనా సమస్యలు చెప్పుకోవా లంటే ప్రజలకు కూడా అనుమతి లేకపోవడం దారుణమన్నారు. ఈ సమా వేశంలో మార్కెట్‌ యార్డు చైర్మన్‌ రాజా నారాయణమూర్తి, ఓబులాపురం శేషిరెడ్డి, సేనా, ఓంప్రకాష్‌, మిద్దెపల్లి గోవిందు, ఆకుల శేఖర్‌ పాల్గొన్నారు.

బేతంచెర్ల: రాష్ట్రంలో టీడీపీతోనే సుపరిపాలన సాధ్యమని డోన్‌ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం మండలం లోని అంబాపురం గ్రామంలో సుంకులా పరమేశ్వరి దేవికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. కొమ్మూరి కొట్టాల, హెచ్‌.కొట్టాల గ్రామాల్లోనూ టీడీపీ నాయకులు ఉన్నం ఎల్ల నాగయ్య, పట్టణ అధ్యక్షురాలు బుగ్గన ప్రసన్నలక్ష్మీ ఆధ్వర్యంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కోట్ల మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ పాలనలో దళిత, బడుగు, బలహీనవర్గాలపై దౌర్జన్యాలు అధికమయ్యానన్నారు. కార్యక్రమంలో సోమశేఖర్‌ రెడ్డి, కోట్ల గిరిధర్‌ రెడ్డి, అంబాపురం సర్పంచ్‌ శ్రీనివాస్‌ యాదవ్‌, ఆర్‌.బుక్కాపురం సర్పంచ్‌ నాగరాజు, జావాజీ వెంకటేశ్వర్లు, మేకల నాగరాజు, రూబెన్‌, రవీంద్రనాయ్‌, ముల్లా ఎంఎస్‌, చంద్రశేఖర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 12:01 AM