Share News

గాలివాన భీభత్సం

ABN , Publish Date - May 21 , 2024 | 12:02 AM

రుద్రవరం మండలంలో సోమవారం సాయంత్రం గాలివాన భీభత్సం సృష్టించింది.

గాలివాన భీభత్సం

పిడుగుపాటుకు 12 పొట్టేళ్లు మృతి

నేల కూలిన విద్యుత్‌ స్తంభాలు, చెట్లు

బి. నాగిరెడ్డి పల్లెలో మిద్దె చుంచుపై పడిన పిడుగు

రుద్రవరం, మే 20: రుద్రవరం మండలంలో సోమవారం సాయంత్రం గాలివాన భీభత్సం సృష్టించింది. వారపుసంతలో గుడారాలు చెల్లా చెదరయ్యాయి. భయంకరమైన ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. విద్యుత్‌స్తంభాలు విరిగి నేలపడ్డాయి. ఆటోలపై చెట్లుపడ్డాయి. తువ్వపల్లెలో చింతచెట్టు నేలవాలాయి. నాగుల వరంలో చెట్టుకొమ్మలు విరిగి ఆర్‌అండ్‌బి రహదరారికి అడ్డంగా విరిగిపడ్డాయి. ఆదివారం రాత్రి ఆర్‌ కొత్తపెల్ల గ్రామంలో ఖాసీంసాబ్‌ అనే వ్యక్తికి చెందిన 12 పొట్టేళ్ళు పిడుగు పడడంతో మృత్యువాత పడ్డాయి. దీంతో సుమారు లక్షా యాభైవేల రూపాయల నష్టం వాటిల్లింది. అలాగే బి.నాగిరెడ్డిపల్లెలో మిద్దె చుంచుపై పిడుగు పడింది. రుద్రవరంలో విద్యుత్‌ స్తంభాలు నేల కూలడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది.

Updated Date - May 21 , 2024 | 12:02 AM